Begin typing your search above and press return to search.

ఎంత దారుణ‌మంటే.. గ్యాంగ్ రేప్‌ చేసి.. ఇంటి వ‌ద్ద దింపారు.. !

By:  Tupaki Desk   |   19 Nov 2022 12:07 PM GMT
ఎంత దారుణ‌మంటే.. గ్యాంగ్ రేప్‌ చేసి.. ఇంటి వ‌ద్ద దింపారు.. !
X
ముగ్గురు యువ‌కులు ఓ యువ‌తిపై గ్యాంగ్ రేప్ చేశారు. అంతేకాదు..అనంత‌రం ఆమెను ఇంటి ద‌గ్గ‌ర దింపేశారు. ఈ ఘ‌ట‌న‌లో యువ‌తి స్నేహితురాలు.. ఆ యువ‌కుల‌కు స‌హ‌క‌రించ‌డం.. కొస‌మెరుపు. అత్యంత దారుణ‌మైన ఈ ఘ‌ట‌న కేరళలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ మోడల్పై కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. అనంతరం ఆమెను ఇంటిదగ్గర దింపేసి వెళ్లిపోయారు.

కేరళలోని కొచ్చి జిల్లాలో జ‌రిగిన ఈ దారుణం.. తీవ్ర సంచ‌ల‌నం రేపుతోంది. మద్యం మత్తులో ఉన్న 19 ఏళ్ల మోడల్పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని కారులో తీసుకెళ్లి కక్కనాడ్లోని ఆమె ఇంటివద్ద విడిచిపెట్టేశారు. ఈ ఘటనపై బాధితురాలి స్నేహితుడి ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.

స‌ద‌రు బాధితురాలి లేడీ ఫ్రెండ్‌ సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గురువారం రాత్రి బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి కొచ్చిలోని ఓ బార్‌కి వెళ్లింది.

మద్యం తాగిన ఆమె.. స్పృహ తప్పిపడిపోయింది. ఆ స‌మ‌యంలో యువ‌తి స్నేహితురాలు కూడా అక్క‌డే ఉంది. అయితే, యువతిని ఆమె ఇంట్లో దింపుతామని చెప్పి.. ముగ్గురు యువకులు కారులో తీసుకెళ్లారు.

అనంతరం ఆమెను నగరంలో తిప్పుతూ కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు.. బాధితురాలి స్నేహితురాలిని ప్రశ్నించారు. ముగ్గురు నిందితులు కొడంగలూరుకు చెందినవారని ఆమె చెప్పింది.

దీంతో వారిని అరెస్టు చేశారు. అయితే, ఈ యువ‌కుల‌కు స‌హ‌క‌రించార‌న్న కార‌ణంగా బాధితురాలి స్నేహితురాలిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.