Begin typing your search above and press return to search.
బంగ్లా యువతి పై గ్యాంగ్ రేప్ ...సంచలన నిజాలు వెలుగులోకి, కేసు కీలక మలుపు !
By: Tupaki Desk | 31 May 2021 7:30 AM GMTఐటీ హబ్ గా పేరుగాంచిన బెంగళూరు లో బంగ్లాదేశ్ కు చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ వీడియోలు వెలుగులోకి రావడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రూరమైన చర్యలో నిందితులుగా ఉన్న ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే .. బెంగళూరులో యువతిని సాముహిక అత్యాచారం చేసిన నిందితులు, ఆ వీడియోలను అసోం, ఈశాన్య రాష్ట్రాల్లోని తమకు తెలిసిన వారికి షేర్ చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బెంగళూరులో జరిగినట్టు తేలడంతో.. అక్కడి పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నలుగురు యువకులు, ఇద్దరు యువతులను పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్ కు చెందిన హకీల్, బంగ్లాదేశ్ కు చెందిన సాగర్, మహ్మద్ బాబా కేశ్, రియాద్ బాబు, నస్రత్, కాజల్ ను పోలీసులు నిందితులుగా గుర్తించారు.
నిందితులు తాము ఉంటున్న అద్దె ఇంట్లోనే వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ ఇంట్లో పలువురు యువతులతో వ్యభిచారం చేయించేవారని తేలింది. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో బాధిత మహిళకు, నిందితులకు గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే నిందితులు ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంచానికి కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రైవేటు పార్ట్స్ పై మద్యం సీసాలతో దాడి చేశారు. ఇక, ఈ ఘటన జరిగిన అనంతరం బాధిత మహిళ నిందితుల వద్ద నుంచి తప్పించుకుని కేరళలోని కోజికోడ్ కు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత బాధిత యువతిని బెంగళూరు కి తీసుకువచ్చి, ఇందిరానగర పోలీస్‌స్టేషన్ లో విచారించారు. తనపై చిత్రహింసలు జరిగిన మరుసటి రోజే కేరళకు వెళ్లిపోయానని యువతి చెప్పింది. అక్కడే తన ప్రియుడు ఉన్నాడని, దుండగుల భయంతో కేరళలో తలదాచుకున్నట్లు చెప్పింది. తనకు తల్లిదండ్రులు లేరని, కుటుంబ బంధువులు కూడా ఎవరూ లేరని బాధితురాలు పోలీసులకు తెలిపింది. గతంలో తాను దుబాయ్‌లో డ్యాన్సర్‌గా పని చేసి ఢాకాకు వెళ్లిపోయినట్లు చెప్పింది. నిందితుల సూచనతో బెంగళూరుకు వచ్చానని తెలిపింది. డబ్బుల విషయంలో నిందితులతో గొడవ జరిగిందని, అత్యాచార సమయంలో మరో యువతి కూడా ఉన్నట్లు తెలిపింది. ఆమె చెప్పిన దాని ప్రకారం మరో యువతి కోసం పోలీసులు వెతుకుతున్నారు.