Begin typing your search above and press return to search.
దాచేపల్లి కంటే ఘోరం..బాలికపై ఐదుగురి రేప్..
By: Tupaki Desk | 25 May 2018 5:13 AM GMTఆంధ్రప్రదేశ్ లో మొన్నటికి మొన్న చోటుచేసుకున్న దాచేపల్లి అత్యాచార ఘటన మరిచిపోకముందే మరో దారుణం జరిగిపోయింది. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది. ఐదురుగు మైనర్ బాలురు ఓ మైనర్ బాలికపై నెలల తరబడి అత్యాచారం చేస్తూ వస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
భర్త చనిపోవడంతో ఉపాధి నిమిత్తం ఓ మహిళ తన 11 ఏళ్ల కూతురుతో కలిసి పుంగనూరు పట్టణానికి వచ్చింది. స్థానిక భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటోంది. ఇదే క్రమంలో కాలనీకి చెందిన 15 ఏళ్ల బాలుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బాలుడు ప్రేమ పేరు చెప్పి మూడు నెలల క్రితం తన సెల్ ఫోన్ అశ్లీల చిత్రాలు చూపించి బాలికను లొంగదీసుకున్నాడు.
బాలికను లొంగదీసుకున్న విషయాన్ని ఆ బాలుడు మరో నలుగురు స్నేహితులకు చెప్పాడు. ఆపై వారికి సహకరించేలా బాలికను బెదిరించాడు. అంతా కలిసి రెండు నెలలుగా బాలికపై అత్యాచారం చేస్తున్నారు. విషయం బయటకు పొక్కితే తీవ్రంగా ఉంటుందని బాలికను హెచ్చరించారు. ఓ రోజు బాధిత బాలిక పట్ల స్థానిక బాలుడు అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు చూసి ఆమె తల్లికి చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలికను ఆరాతీయగా.. నాలుగు నెలలుగా నిందితులు తనపై లైంగిక దాడి చేస్తున్నారని వాపోయింది.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలురంతా పెద్దగా చదువుకోని వారని.. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళుతుండడంతో ఇంటి వద్ద అల్లరచిల్లరగా తిరుగుతూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటారని విచారణలో తేలింది. మైనర్లు కావడంతో నలుగురు బాలురను అరెస్ట్ చేసి తిరుపతి జువైనల్ హోంకు తరలించారు.బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇది బాలికపై గ్యాంగ్ రేప్ కాదని.. తెలిసి తెలియని వయసులో చేసిన నేరమని వివరించారు. నిందితులపై పోక్సో చట్టం, నిర్భయ చట్టం కింద కేసునమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.