Begin typing your search above and press return to search.

అమ్మాయి కోసం కొట్టుకున్న స్టూడెంట్స్ గ్యాంగ్స్

By:  Tupaki Desk   |   28 April 2019 12:54 PM IST
అమ్మాయి కోసం కొట్టుకున్న స్టూడెంట్స్ గ్యాంగ్స్
X
16 ఏళ్లకే పడుచు ప్రాయం గంట కొడుతున్న వేళ విద్యార్థులు కూడా ప్రేమలోకంలో విహరిస్తున్నారు. ఇక సినిమాల ప్రభావంతో ఇంటర్ లోనే ప్రేమాటలను మొదలు పెడుతున్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఫ్యార్చూన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కాలేజీ విద్యార్థులు ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారు. బీభత్సం సృష్టించారు. వీరి గలాటా చూసి స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. వారి గొడవలో తమకు గాయలవుతాయని చాలా మంది వాహనాలు విడిచి పారిపోయారంటే వీరి బీభత్సం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఫ్యార్చూన్ కాలేజీలో చదువుతున్న ఓ అమ్మాయి విషయంలో నెలకొన్న స్పర్థలే గొడవలకు దారితీశాయి. లవన్ కుమార్ అనే విద్యార్థి ఇదే కాలేజీకి చెందిన ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడు. ఇదే విషయంపై ఆ అమ్మాయి తన కాలేజీకి చెందిన హేమంత్ కు చెప్పింది. దీంతో హేమంత్, లవణ్ కుమార్ ను కొట్టేందుకు ప్లాన్ చేశారు. నైన్త్ ఫేజ్ లోని గ్రావిటీ హోటల్ లో ఫేర్ వెల్ పార్టీని ఇందుకు అవకాశంగా మలుచుకున్నాడు.

ఫేర్ వల్ పార్టీకి వచ్చిన లవణ్ కుమార్ ను అదును చూసి హేమంత్ కొట్టుకుంటూ రోడ్డుపైకి ఈడ్చుకొచ్చాడు. బయట ఉన్న మరికొందరు ఫ్రెండ్స్ తో కలిసి లవణ్ కుమార్ పై దాడి చేశాడు. అయితే లవణ్ కుమార్ కు సపోర్ట్ గా కొందరు విద్యార్థులు కర్రలు - రాళ్లు పట్టుకొని రోడ్లపై పరస్పరం దాడి చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడికే వచ్చి హేమంత్ తోపాటు పవన్ - అభిషేక్ - బాలు లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ లవణ్ కుమార్, గొడవలో గాయపడ్డ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విశేషం.విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యానే వారంతా కేసులు, పోలీసుల జోలికి వెళ్లకుండా కాంప్రమైజ్ అయినట్టు తెలిసింది.