Begin typing your search above and press return to search.
గంగవరం పోర్టు అదానీ సొంతం!
By: Tupaki Desk | 23 March 2021 2:52 PM GMTదేశంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక మొత్తం ప్రైవేటు పరం చేస్తోంది. దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను పప్పూ బెల్లాల్లా అమ్మేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. అంతేకాదు పోర్టులు, ఎయిర్ పోర్టులను ఎంతకో అంతకూ అమ్మేస్తూ పోతోంది. అయితే ప్రభుత్వం పోర్టుల పరిస్థితి ఇలా ఉంటే మోడీ హాయంలో మాత్రం కార్పొరేట్లు ఏకంగా పోర్టులను కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. ఏపీలోని ప్రైవేటు రంగం చేతుల్లో ఉన్న గంగవరం పోర్టును సైతం తాజాగా ప్రముఖ గుజరాతీ పారిశ్రామికవేత్త అదానీ కొనుగోలు చేయడం విశేషం.
ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం పోర్ట్ లో 58.1శాతం వాటాను తాజాగా అదానీ స్పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(ఏపీఎస్ఈజెడ్) కొనుగోలు చేసింది. దీంతో పోర్టులోని మెజార్టీ వాటా అదానీ సొంతమైంది. ఈ మేరకు అదానీ గ్రూపు ప్రకటించింది.
డీవీఎస్ రాజు, ఆయన కుటుంబానికి చెందిన 58.1శాతం వాటాను రూ.3604 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు అదానీ గ్రూపు తెలిపింది. ఇప్పటికే ఈ పోర్టు కంపెనీలోని 31.5శాతం వాటాను రూ.1954 కోట్లకు వార్ బర్గ్ సంస్థ నుంచి కొనేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ రెండు పూర్తయితే గంగవరం పోర్టులో అదానీ గ్రూపు వాటా 89.6శాతానికి చేరుతుంది.
విశాఖకు సమీపంలోని గంగవరం పోర్టు కీలకంగా ఉంటుంది. ఏపీలోనే రెండో అతిపెద్ద నాన్ మేజర్ పోర్ట్ కెపాసిటీ కలిగింది. ఏపీ ప్రభుత్వం రాయితీతో దీన్ని నిర్మించారు. ఇది బాగా లోతైన పోర్ట్. ఏ కాలంలోనైనా సూపర్ కేప్ సైజ్ ఓడులు వచ్చి వెళ్లగలవు. ఇందులో 9 బెర్తులున్నాయి. 1800 ఎకరాల్లో విస్తరించి ఉంది.
గంగవరం పోర్టు నుంచి బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్ ,పంచదార, అల్యుమినియం, ఉక్కు ఎగుమతులు దిగుమతులు సాగుతాయి. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరుకు వస్తుంది. ఎలాంటి రుణాలు లేని ఈ పోర్టుకు 500 కోట్ల క్యాష్ బ్యాలెన్స్ ఉంది. దీంతో అదానీ గ్రూపు లాభాల్లోని ఈ పోర్టును కొని క్యాష్ చేసుకుంది.