Begin typing your search above and press return to search.
గంగిరెడ్డి వస్తే వైకాపా ఎమ్మెల్యే పరిస్థితి!?
By: Tupaki Desk | 12 May 2015 7:58 AM GMTకీలకమైన కేసులో నిందితులు, సాక్ష్యులు తప్పించుకు తిరుగుతుంటే... నిందుతులను అయితే పట్టుకోవడానికి పోలీసులు ఎలాగూ ఉన్నారు... ఇక సాఖ్స్యుల సంగతి ఆయా క్లైంట్ లు చూసుకుంటారు. లేదా వాళ్ల సంబందిత లాయర్లు సెట్ చేసుకుంటారు! అలా కాకుండా ఏకంగా లాయరే జంప్ అయితే! కేసును వాదించే లాయరే వ్యూహాత్మకంగా కనిపించకుండా పోతే, అది కూడా విడేసాలతో సంబందం ఉన్న కేసయితే? ప్రస్తుతం ఎర్రచందనం అకరమ రవాణా కేసులో ప్రధాన నిందితుడు కొల్లం గంగిరెడ్డి విషయంలో ఇదే జరిగిందట!
గంగిరెడ్డి తరుపు లీగల్ల్ లాయర్ సుమారు రెండు నెలలు లీవు పెట్టి వెళ్లారని కథనాలు వస్తున్నాయి! కీలకమైన కేసులు, విదేశాలతో ముడిపడిన కేసుకు సంబందించి ఎంత బిజీ అయితే మాత్రం మరీ రండు నెలలు ఎలా వెళ్తారు అనుకునే లోపు మరో విషయం వెలుగులోకి వచ్చిందట! ఆ లాయర్ సెలవుపై వెళ్లడం అనేది వైకాపా ఎమ్మెల్యే ఒకరి వ్యూహంలో భాగమట! వీటికి సంబందించిన కథనాలు వెబ్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి! ఇప్పటికే మారిషస్ నుంచి గంగిరెడ్డిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను నీరుగార్చడానికి ఆ ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషికి తన వంతు సాయంగా ఈ లాయరు గారు తప్పించుకు తిరుగుతున్నారట!
అయితే గంగిరెడ్డికి సంబందించిన కేసు మారిషస్ కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో ఈ వైకాపా ఎమ్మెల్యే నే గంగిరెడ్డికి అనుకూలంగా వాదించేందుకు ఓ న్యాయవాదిని అపాయింట్ చేశారని, అతనికి అటు హైకోర్టు జండ్జి కూడా సహకరిస్తున్నారని గాసిప్పులు వినిపిస్తున్నాయి! గంగిరెడ్డికీ వైకాపా ఎమ్మెల్యేకీ సంబందం ఏమిటని చిన్నపిల్లలా చాలా మంది అడిగే ప్రశ్నలకు కూడా వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్త సమాధానం చెబుతుంది! గంగిరెడ్డి భారత్ లో కాలు పెడితే... అతడితో పాటు వెంటనే శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లేవారిలో ఈ ఎమ్మెల్యే ముందువరుసలో మొదటి వ్యక్తిగా ఉంటారట! కాగా ఆ స్మగ్లర్ మీద 14 కేసులు ఉన్నాయని, తప్పుడు పాస్ పోర్టుతో అతగాడు మారిషస్ లో ఉన్నాడని ఏపీ డీజీపీ రాముడు, సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు అక్కడి కోర్టుకు తెలిపారని తెలుస్తుంది!