Begin typing your search above and press return to search.
వామ్మో...గంగిరెడ్డి ఆస్తులు అన్ని కోట్లా..
By: Tupaki Desk | 1 July 2016 9:52 AM GMTచెట్లు కొట్టి కోట్లు కూడబెట్టడం అంటే ఇదేనేమో! శేషాచలం అడువుల్లోని విలువైన ఎర్ర చందనం చెట్లను నరికి - వాటిని దుంగలుగా మార్చి గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించిన అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ఆస్తులు రూ.2 వేల కోట్లకు పైమాటేనని తేలింది. ఏపీ సీఎంగా చంద్రబాబు అధికారంలోకి వచ్చే వరకు యథేచ్ఛగా చెలరేగి పోయిన గంగిరెడ్డికి సీఎం చంద్రబాబు ముకుతాడు వేశారు.
దీంతో గంగిరెడ్డి ప్రస్తుతం కడప జిల్లా జైల్లో ఉచలు లెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో గంగిరెడ్డి ఆస్తులు ఎన్ని? వాటిని స్వాధీనం చేసుకోవచ్చా అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో అతడు కూడబెట్టిన ఆస్తుల చిట్టాను చూసి పోలీసులే షాక్ తిన్నారట. కడప జిల్లాలోని తన సొంత మండలం పుల్లంపేట - పొరుగు మండలం రైల్వే కోడూరు తదితర ప్రాంతాల్లో అతడు విలువైన స్థలాలతో పాటు పల్వనైజింగ్ మిల్లులు - పెట్రోల్ పంపులు నడుపుతున్నట్లు తేలింది.
వీటితో పాటు తిరుపతి - చెన్నై - బెంగళూరు - హైదరాబాదుల్లో భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. వీటి విలువ ఎంతలేదన్నా రూ.2 వేల కోట్ల పైమాటేనని పోలీసులు చెబుతున్నారు. ఇక చాలా కాలం పాటు విదేశాల్లో తలదాచుకున్న అతడు అక్కడ రూ.1,000 కోట్లకు పైగానే నగదును కూడబెట్టినట్లు స్వయంగా అతడి అనుచరులే చెబుతున్నారు. వీటన్నిటినీ స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం గంగిరెడ్డి ఆస్తుల వ్యవహారం ఏపీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.