Begin typing your search above and press return to search.
హైదరాబాద్‌కు వచ్చేసిన గంగిరెడ్డి
By: Tupaki Desk | 15 Nov 2015 8:45 AM GMTప్రముఖ ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి ఎట్టకేలకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన హత్యాయత్నంలోనూ గంగిరెడ్డి నిందితులు. ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్న ఆయన.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సమయంలో బెయిల్ మీద ఉన్న ఆయన.. విదేశాలకు పారిపోవటం తెలిసిందే. ప్రముఖ రాజకీయ నేతలతో సంబంధాలున్న గంగిరెడ్డి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
గంగిరెడ్డి ఆచూకీ కోసం జల్లెడ పట్టిన పోలీసులు.. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయటంతో మారిషస్ పోలీసులకు చిక్కారు. అనంతరం అక్కడి జైల్లో మగ్గుతున్న అతన్ని.. భారత్‌కు రప్పించే విషయంలో విజయం సాధించారు. మారిషస్ నుంచి ఢిల్లీకి చేరుకున్న గంగిరెడ్డిని.. ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితం (ఆదివారం మధ్యాహ్నం 12.30 సమయంలో శంషాబాద్ చేరుకున్న ప్రత్యేక పోలీసులు. గంగిరెడ్డిని తీసుకొని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మీడియా కంట పడకుండా ఉండేందుకు వేరే మార్గం నుంచి గంగిరెడ్డిని తరలించారు. భారీ బందోబస్తు మధ్యన డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్న గంగిరెడ్డిని.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మీడియా సమావేశాన్ని పోలీసులు ఏర్పాటు చేయనున్నారు.