Begin typing your search above and press return to search.
జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ కు కరోనా పాజిటివ్ ... !
By: Tupaki Desk | 6 May 2020 12:30 PM GMTకరోనా వైరస్ ఎవరిని వదిలి పెట్టడంలేదు. బయట ఉన్నవారికే కాదు జైల్లో ఉన్నవారికి కరోనా సోకుతుంది. ఈ తరుణంలోనే ఓ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీనితో పోలీసుకు టెన్షన్ మొదలైంది. పంజాబ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ లోని కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ జగ్గూ భగవాన్ పూరియా కు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది.
ప్రస్తుతం ఓ హత్యకేసు లో నిందితుడిగా పాటియాలా సెంట్రల్ జైలులో పోలీసు కస్టడీలో ఉన్నాడు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతడికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం జగ్గూని కలిసిన వారిని క్వారంటైన్ చేసింది. ఇతన్ని విచారించేందుకు డీఎస్పీ స్థాయి అధికారులు కూడా రావడంతో వారంతా స్వీయ గృహ నిర్భందంలోకి వెళ్లారు. వారికి కూడా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జైలులో జగ్గూకు కరోనా ఎలా సోకిందనే మిస్టరీగా మారింది.
అయితే కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పాటియాలా జైలు నుంచి కొంతమంది ఖైదీలను బటాలా జైలుకు తరలించారు. వారిలో జగ్గూ కూడా ఒకరు. ఈ క్రమంలోనే అతనికి కరోనా సోకిందేమోనని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో అకాళీదల్ నాయకుడు, సర్పంచ్ హత్య కేసులో జగ్గూ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతడిపై 22 హత్యకేసులు సహా 41 క్రిమినల్ కేసులు ఉన్నట్టు పంజాబ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.