Begin typing your search above and press return to search.
నయీం బాదితుల్లో పవన్ నిర్మాత?
By: Tupaki Desk | 18 Aug 2016 4:15 AM GMTతవ్వేకొద్దీ బయటపడుతున్నాయి నేరల ఘని నయీం వ్యవహారాలు! గ్యాంగ్ స్టర్ గా నయీం సంపాదనలు - అక్రమాలు - దౌర్జన్యాలపై ఇప్పటికే అధికారికంగా సిట్ బృదం అనేక కీలకమైన విషయలు సేకరించింది. ఈ సమయంలో ఇప్పటికే నయీంకు సినిమా పరిశ్రమతోనూ కనెక్షన్స్ ఉన్నాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒక హీరోయిన్ కి సంబందించిన ఆరెకరాల భూమి కబ్జా చేశాడని వార్తలు వచ్చిన అనంతరం - బంజారాహిల్స్ లోని తన ఇంటికి సంబందించి సమస్య రావడంతో ఒక మంత్రిని కలిసిన మరో హీరోయిన్ ని వెంటపడి వేదించాడని - ఆమెపై కన్నేసాడని - అతడి వేదింపులు భరించలేక ఆమె హైదరాబాద్ విడిచివెళ్లిపోయిందని.. ఇలాంటి విషయాలు ఇప్పటివరకూ మీడియాలో వచ్చాయి. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీలోని పెద్దవ్యక్తులతో కూడా నయీం కు కనెక్షన్స్ ఉన్నాయట. వారిలో కూడా నయీం బాదితులు ఉన్నారనేది తాజా విషయం.
ఓ ప్రముఖ టీవీ ఛానల్ కథనం ప్రకారం.. నయీం బాదితుల్లో తెలుగు సినిమా నిర్మాతలు కూడా ఉన్నారట. పలువురు నిర్మాతలను బెదిరించిన నయీం.. కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. వీరిలో గతంలో పవన్ కల్యాణ్ తో సినిమాలు తీసిన ఒక నిర్మాత కూడా ఉన్నారట. పవన్ కల్యాణ్ సినిమా నిర్మాతను కూడా నయీం అప్పట్లో బ్లాక్ మెయిల్ చేసినట్లుగా సమాచారం. ఈ బెదిరింపులకు భయపడిన సదరు నిర్మాత రూ.8.5 కోట్లు నయీంకు ముట్టచెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. నయీం దెబ్బకు ఆ నిర్మాత కొంతకాలం సినిమాలకే దూరమయ్యాడనేది తాజా సమాచారం.
చిన్న నిర్మాతా - పెద్ద నిర్మాతా అనే తారతమ్యాలు పెద్దగా పట్టించుకోని నయీం.. సినిమా హిట్ అయిన నిర్మాతలను మాత్రం కస్త ఎక్కువగానే వేదించేవాడట. కొంత పెర్సంటేజ్ లెక్కగట్టి అది వసూల్ చేసేవరకూ నయీం నిద్రపోయేవాడు కాదట. ఈ రేంజ్ లో సాగిన నయీం వ్యవహారాలు ఇంకా ఎన్ని బయట పడనున్నాయో వేచిచూడాలి. ఆ నిర్మాత ఎవరై ఉంటారబ్బా అనే విషయంపై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫుల్ చర్చోపచర్చలు నడుస్తున్నాయట.