Begin typing your search above and press return to search.
నయీం కు ఉన్న భూమి ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 17 Aug 2016 4:36 PM GMTఅధికారికంగా ఇప్పటివరకూ నయీం చేసిన దారుణాలు - అక్రమాలు - ఆక్రమణలు - హత్యలు - బెదిరింపులు - కట్టించుకున్న టాక్స్ లు - సంపాదించిన ఆస్తులపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న తరుణంలో.. తాజాగా నయీం కి ఉన్న భూమి గురించి ఒక ఆశ్చర్యకరమైన సంగతి తెలిసింది. నయీం కి ఇప్పటివరకూ ఉన్న భూమి ఎంత ఉంటుందనుకుంటున్నారు? అంటే.. ఇప్పటివరకూ వంద ఎకరాలు - రెండొందల ఎకరాలు.. కాదు కాదు ఏకంగా ఐదొందల ఎకరాలు అని మీడియాలో గాసిప్పులు వినిపించాయి. కానీ.. తాజాగా అధికారికంగా సిట్ బృందాలు గుర్తించిన నయీం పేరిట ఉన్న భూమి అక్షరాలా వెయ్యీ పదిహేను ఎకరాలు. అవును సిట్ బృందంతో పాటు జనాలందరినీ ఆశ్చర్యానికి గుర్తిచేస్తున్న సంగతి ఇది!
అప్పుడే అయ్యబాబోయే అంత భూమే అనుకుంటున్నారా? ఆగండాగండీ... ఇంకా ఉంది! ఈ వెయ్యి ఎకరాల భూమే కాకుండా.. మరో లక్షా 20వేల చదరపు గజాల ఇళ్ల స్థలాలు - 20కి పైగా బిల్డింగులు కూడా నయీం పేరున ఉన్నాయట. ఇవన్నీ సిట్ బృందాలు ఇప్పటివరకు అధికారికంగా గుర్తించినవే. రోజురోజుకు పెరిగిపోతున్న నయీం బాధితుల ఫిర్యాదులు గమనిస్తుంటే.. ఆయన ఆస్తుల చిట్టా ఇంకా ఉండే ఉంటుందని సిట్ అధికారులు భావిస్తున్నారట. ఇదే క్రమంలో సిట్ బృందాలు నయీం బంధువులు - మిత్రులు - అనుచరుల ఇళ్లల్లో సోదాలు చేస్తుంటే పాతపేపర్ల కట్టలు ఉన్నట్లు కుప్పలు తెప్పలుగా దస్తావేజులు బయటపడుతున్నాయట. సాదారణ కుటుంబంలో మూడు, ఆరు నెలల నుంచి పోగేసిన న్యూస్ పేపర్ల కట్ట ఎంత ఉంటుందో.. ఆస్థాయిలో దస్తావేజుల కుప్పలు కనిపిస్తుంటే.. సిట్ అధికారులే ఆశ్చర్యపోతున్నారట.
ఈ దస్తావేజుల్లో కొన్ని సెటిల్ మెంట్ల ద్వారా వచ్చినవి కాగా.. మరికొన్ని బెదిరించి బదలాయించుకున్నవి. ఎలా సంపాదించాడనే విషయం కాసేపు పక్కన పెడితే.. ఇప్పటివరకూ నయీం కుటుంబసభ్యులు - అనుచరుల పేరిట మొత్తంగా 1015 ఎకరాల భూములు ఉన్నాయట. ఈ భూములన్నీ తెలంగాణ జిల్లాలు నల్గొండ - మహబూబ్ నగర్ లతోపాటు ఛత్తీస్ గఢ్ లోనూ ఉండటం గమనార్హం. భూములు అలా జిల్లాలు - పక్క రాష్ట్రాల్లో విస్తరిస్తే... లక్షా చదరపు గజాలకు పైగా ఉన్న ఇళ్ల స్థలాలు మాత్రం ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయట.
అప్పుడే అయిపోయిందనుకేరు... ఇంకా ఉంది! రెండు గదుల ఇళ్లు కూడా లేని సామాన్యులు పుష్కలంగా ఉన్న ఈ దేశంలో నయీం పేరున ఏకంగా 20 భవనాలు ఉన్నాయట. అవికూడా తెలంగాణ జిల్లాలు హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ లతో పాటు గోవాలో కూడా ఉన్నట్లు సిట్ గుర్తించింది. భూముల సంగతి - భవనాల సంగతి అలా ఉంటే.. మరోవైపు రూ.2.08కోట్ల లిక్విడ్ క్యాష్ - సుమారు 2.14కిలోల బంగారం కూడా లభించిందట. ఇన్ని ఆశ్చర్యకరమైన సంగతులకు తోడుగా మరో విషయం తెలిసింది.. అదే బ్యాంక్ ఖాతాల గురించి. అవి కూడా నయీం స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయట. ఈ మేరకు సోదాలు చేసిన సిట్ కు నయీం, అతని అనుచరుల పేరున 250 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా అనుచరులను కూడా ఎక్కువగా నమ్మని నయీం.. తన ఆస్తులన్నీ భార్య - సోదరి - సమీప బంధువుల పేరిటే ఉంచాడట. ఇది.. నయీం గురించి ఇప్పటివరకూ తెలిసిన భూముల - భవనాల సంగతులు. ఇంకా సిట్ సోదాల్లో ఎన్నెన్ని ఆస్తులు బయటపడనున్నయోమరి!!