Begin typing your search above and press return to search.
నయిం వారినే టచ్ చేశాడట
By: Tupaki Desk | 11 Aug 2016 7:43 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లో నయిం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతడ్ని ఎన్ కౌంటర్ చేయటంపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేసింది లేదు. కాకుంటే.. ఎన్ కౌంటర్ తర్వాత బయటకు వస్తున్న సమాచారం విస్తుపోయేలా చేయటంతో పాటు.. నయిం మరీ ఇన్ని దారుణాలకు పాల్పడ్డారా? అని షాక్ తినే పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఇన్ని ఆరాచకాలు చేసినా పట్టని పోలీసులు.. ఇప్పుడే ఉన్నట్లుండి నిద్ర నుంచి మెలుకవలోకి వచ్చినట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? నయిం ఎన్ కౌంటర్ కు యుద్ధప్రాతిపదికన ఎందుకు సిద్ధం చేశారన్న అంశంపై రాజకీయ.. పోలీస్.. మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఈ మూడు వర్గాల్లో సాగుతున్న చర్చలో వినిపిస్తున్న సారాంశంలో నిజం పాళ్లు ఎంతన్న విషయాన్ని పక్కన పెడితే.. అత్యున్నత వర్గాలతో పాటు.. కొందరు కీలక వ్యక్తుల నోటి నుంచి ఒకేలాంటి సమాచారం వినిపించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయా వర్గాల్లో వినిపిస్తున్న మాటల్ని చూస్తే.. నయిం వ్యవహారంపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో అన్నీ తానైన వ్యక్తికి సంబంధించిన అతి ముఖ్యుడైన వ్యక్తిని నయిం కెలికారని చెబుతున్నారు. ఎవర్ని టచ్ చేయకూడదో వారినే నయిం టచ్ చేశాడని.. డబ్బుల బెదిరింపుతో పాటు.. తేడా వచ్చే ప్రాణాలు తీస్తామన్న తన రోటీన్ డైలాగుల్ని చెప్పటమే నయింకు మూడేలా చేసిందని చెబుతున్నారు. ఎవరినైతే చూసేందుకు.. వారితో మాట్లాడేందుకు సైతం సాహసం చేయకూడదో.. అలాంటి వ్యక్తినే డబ్బుకోసం బెదిరించటం ఒక ఎత్తు అయితే.. తేడా వస్తే ఖతమేనన్న మాటల్ని సదరు వ్యక్తి సీరియస్ గా తీసుకొని.. ‘ఇదేంటి?’ అన్న ఒక్క ప్రశ్నతోనే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
నయిం గురించి.. అతడి ఆరాచకాల గురించి కాస్త సమాచారం ఉన్నా.. తనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడికే ఇలాంటివి జరగటం ఏమిటన్న ఆగ్రహంతో సదరు ‘పెద్ద’ పోలీసు వర్గాలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వటంతో.. నయిం చరిత్ర మొత్తాన్ని తవ్వి.. అతడి ఆరాచకాల్ని చెప్పటం.. వెంటనే ‘సంగతి చూడాలి’ అన్న మాటతో నయిం ఖేల్ ఖతమైనట్లుగా చెబుతున్నారు. ఎన్నో దారుణాల్ని తన చేతికి మట్టి అంటకుండా ప్లాన్ చేసిన నయిం.. ఎవర్ని టచ్ చేయకూడదో వారినే టచ్ చేసి మట్టిలో కలిసిపోవటం గమనార్హం.