Begin typing your search above and press return to search.
గ్యాంగ్ స్టర్ ను హడలెత్తించిన దోమలు.. దెబ్బకు దెయ్యం దిగొచ్చింది..!
By: Tupaki Desk | 5 Nov 2022 6:30 AM GMT''మా నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్.. ఊర్లో ఆయన్ని చూసి అందరూ భయపడిపోతారు.. కానీ ఈ దోమలు మాత్రం భయపడవు'' అని ఓ పిల్లవాడు దోమల మస్కిటో కాయిల్స్ పై చేసిన ఓ యాడ్ టీవీల్లో వస్తూ ఉంటుంది. మస్కిటో కాయిల్స్ కు మాత్రమే దోమలు భయపడి పారిపోతాయనే కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ యాడ్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అచ్చం ఇలాంటి సంఘటనే ముంబాయిలోని తలోజా జైల్లో జరిగింది. అయితే ఇక్కడ దోమలు భయపడింది మాత్రం పోలీస్ ఆఫీసర్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ డాన్ మాజీ అనుచరుడు.. గ్యాంగ్ స్టర్ ఎజాబ్ లక్డావాలా ప్రస్తుతం తలోజా జైల్లో ఉన్నాడు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రెండేళ్ల నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు.
తాజాగా ఓ కేసులో విచారణ నిమిత్తం ఈ గ్యాంగ్ స్టర్ కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఎజాజ్ చేసిన పనికి అందరూ షాకయ్యారు. జైల్లో తాను చంపిన దోమలను ఒక బాటిల్ లో చూపిస్తూ తనను వాటి నుంచి కాపాడాలని న్యాయమూర్తిని వేడుకున్నాడు. దోమల బెడదను తట్టుకోలేక పోతున్నానని తన రక్షణ కోసం దోమ తెరను ఏర్పాటు చేసేలా అధికారులకు ఆదేశాలివ్వాలని వాపోయాడు.
తాను 2020లో అరెస్టయిన సందర్భంలో పోలీసులు ఓ దోమతెరను ఏర్పాటు చేశారని తెలిపాడు. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఆ తర్వాత దానిని తొలగించారని కోర్టుకు విన్నవించాడు. అయితే ఎజాజ్ వాదనను కోర్టు తోసి పుచ్చింది.
దోమల నుంచి కాపాడుకునేందుకు దోమ తెరలే వాడాల్సిన అవసరం లేదని ప్రత్యామ్నాయంగా ఓడొమోస్ లేదా మస్కిట్స్ కాయిల్స్ తదితర సాధనలు ఎన్నో ఉన్నాయని సూచించింది. ఈ సాధనాలను వినియోగించుకోవాలని కోర్టు ఎజాజ్ కు స్పష్టం చేసింది.
అండర్ వరల్డ్ డాన్ మాజీ అనుచరుడిగా.. గ్యాంగ్ స్టర్ గా ఎందరినో హడలెత్తించిన ఎజాజ్ ప్రస్తుతం జైల్లో దోమలకు భయపడాల్సి రావడం అతడి దీన పరిస్థితికి అద్దం పడుతోంది. దోమల టార్చర్ తో అతడికి దెబ్బకు దెయ్యం దిగొచ్చినట్లే కన్పిస్తోంది. ఇకపై తప్పు చేయాలంటే ముందుగా అతడికి పోలీసులు.. న్యాయ స్థానాల కంటే ముందు దోమలు గుర్తుకు రాకమానదు. ఈ సంఘటనతోనైనా జైలు పక్షులు మారితే అంతే చాలనీ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.