Begin typing your search above and press return to search.
ఈడీ.. ఐటీలకు అర్థం కానట్లుగా మంత్రి గంగుల మారారా?
By: Tupaki Desk | 10 Nov 2022 4:49 AM GMTతప్పు జరిగిందా? ఒప్పు జరిగిందా? అన్నది కాసేపు పక్కన పెట్టేద్దాం. కేంద్రానికి చెందిన ఈడీ.. ఐటీ అధికారులు ఎంట్రీ ఇచ్చి.. సోదాలు నిర్వహించే వేళలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? సదరు ప్రముఖుడు ఎంత తోపు అయినా.. దాని మీద మాట్లాడే దమ్ము.. ధైర్యాన్ని మాత్రం ప్రదర్శించరు. అందునా.. ఏళ్ల తరబడి వ్యాపారాలు చేసే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. తనిఖీల విషయాన్ని ఎవరూ ప్రస్తావించకూడదన్నట్లుగా వారి వైఖరి ఉంటుంది.
అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ టీఆర్ఎస్ సీనియర్ నేత గంగుల కమలాకర్ తీరు ఉందని చెప్పాలి. బుధవారం ఉదయం నుంచి ఈడీ.. ఐటీ సంస్థలు దాడులు చేస్తున్న వైనం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. గుంగుల ఇంట్లో లేకపోవటం.. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. తాళాల్ని కట్ చేసి మరీ ఇంట్లోకి ప్రవేశించి.. సోదాలు నిర్వహించిన వైనం తెలిసిందే.
అధికారులు సోదాలు నిర్వహించే సమయానికి దుబాయ్ లో ఉన్న గంగుల.. బుధవారం రాత్రి అయ్యేసరికి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అధికారుల విచారణకు.. సోదాలకు సహకరిద్దామన్న ఉద్దేశంతో తాను దుబాయ్ నుంచి వచ్చేసినట్లుగా చెప్పి విస్మయానికి గురి చేశారు. అక్కడితే ఆగితే గంగుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరమే ఉండేది కాదు.
మీడియాతో మాట్లాడిన గంగుల.. తన ఇంట్లోనూ.. కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించిన నేపథ్యంలో.. ఎంత దొరికింది? ఏమేం దొరికింది? అన్న విషయాన్ని ఈడీ.. ఐటీ శాఖలు వెల్లడిస్తే బాగుండని పేర్కొన్నారు. తాను దుబాయ్ లో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వీడియోకాల్ చేసి.. ఇంటి తాళాలు తీయమని అడిగారని.. నేనే ఇంట్లోని ప్రతి లాకర్ ను ఓపెన్ చేసుకొని చూసుకోవాలని చెప్పినట్లు పేర్కొన్నారు.
'ఈ సోదాల్లో ఎంత నగదు దొరికింది? ఏమేం స్వాధీనం చేసుకున్నారో ఈడీ అధికారులు చెప్పాలి. దర్యాప్తు సంపూర్ణంగా చేయండి. నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే. మా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. గతంలోనూ చాలామంది మా మీద ఈడీకి.. ఐటీకి కంప్లైంట్లు చేశారు. మేం స్వాగతించాం. మేం పాదర్శకంగా ప్రభుత్వ అనుమతులతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం. ఇలాంటి సమయంలో దర్యాప్తు సంస్థలకు దగ్గరుండి.. వారికి సహకరించాలన్న ఉద్దేశంతోనే దుబాయ్ నుంచి వెంటనే వచ్చేశా'' అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
సాధారణంగా ఈడీ.. ఐటీ సోదాలు జరిగినప్పుడు ముఖం చాటేస్తుంటారు ప్రముఖులు. అందుకు భిన్నంగా మీడియాకు సమాచారం ఇచ్చి మరీ.. తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసిన గంగుల తీరు ఇప్పుడు రోటీన్ కు పూర్తి భిన్నమని మాత్రం చెప్పక తప్పదు. మరి.. గంగుల మాటకు ఐటీ.. ఈడీ అధికారులు ఏమని బదులిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.