Begin typing your search above and press return to search.
యూట్యూబ్ చానల్ వార్తకు ఇంత రియాక్షనా గంగుల?
By: Tupaki Desk | 22 Aug 2019 6:09 AM GMTచిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను చేతల్లో చేసి చూపిస్తున్నారు కరీంనగర్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో ఏదైనా డ్యామేజింగ్ వార్త వస్తే రియాక్ట్ అయ్యే నేతలు ఇప్పుడు పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని యూట్యూబ్ చానళ్లలో తమకు సంబంధించిన నెగిటివ్ వార్తలకు సైతం పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా స్థాయి అంతకంతకూ పెరిగిపోవటం.. ప్రతి ఒక్కరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు వచ్చేయటంతో.. ఎక్కడేం జరిగినా అయితే నిమిషాల్లో.. కాదంటే గంటల్లోనే అందరికి అన్ని తెలిసిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ తమ ఇమేజ్ డ్యామేజ్ చేసే అంశాల్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు నేతలు.
తాజాగా ఒక యూట్యూబ్ చానల్ ఒకటి బీజేపీలోకి వెళ్లనున్న టీఆర్ ఎస్ నేతల జాబితా ఇదేనంటూ ఒక కథనాన్ని ఆన్ లైన్ లో ఉంచింది. అందులో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరు కూడా ఉంది. దీంతో.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గంగుల. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా వ్యవహరిస్తున్నట్లుగా కంప్లైంట్ లో పేర్కొన్న ఆయన.. తన చివరి శ్వాస వరకూ టీఆర్ ఎస్ పార్టీలోనే కొనసాగనున్నట్లుగా భారీ వ్యాఖ్యను చేశారు.
తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే సోషల్ మీడియాలో తనను దెబ్బ కొట్టటానికి వీలుగా కుట్ర జరుగుతుందంటూ.. యూట్యూబ్ కథనం మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశయ సాధన దిశగా తానో సైనికుడిలా పని చేస్తున్నట్లుగా పేర్కొన్న గంగుల తనపై తప్పుడు ప్రచారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చేశారు. యూట్యూబ్ చానల్ కాకుంటే సోషల్ మీడియాలో పోస్టు రూపంలో అయినా ఇరిటేట్ చేస్తారు. అంత మాత్రానికే మరీ ఇంతలా రియాక్షనా అని కొందరు అంటున్నా.. గంగుల మాత్రం తన పేరును బద్నాం చేసే వారి సంగతి చూడాలని గరంగరంగా ఉండటం గమనార్హం.