Begin typing your search above and press return to search.

దేశ సంపద కోసం కేసీఆర్ ఆరాటపడుతున్నారా గంగుల?

By:  Tupaki Desk   |   23 Dec 2022 11:30 AM GMT
దేశ సంపద కోసం కేసీఆర్ ఆరాటపడుతున్నారా గంగుల?
X
మనం నాలుగు మాటలు అంటే.. మనల్ని ఒక మాట అయినా అంటారు కదా? వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడే నేతలకు నెలువుగా నిలుస్తుంటుంది బీఆర్ఎస్ మొన్నటి వరకు టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ నేతలు. తాము కోరుకున్న దాన్ని దక్కించుకోవటం కోసం ఏమాటైనా.. ఎంత మాట అయినా అనేసేందుకు వెనుకాడనితనం గులాబీ నేతలకు కాస్త ఎక్కువ. తెలంగాణ కోసమే తాము ఉన్నదని.. దాని ఆరాటమే తమ పోరాటంగా మాటలు చెప్పినోళ్లు.. ఇప్పుడు తెలంగాణ కాదు.. యావత్ దేశమని చెప్పుకోవటం తెలిసిందే.

ఎవరైనా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టినంతనే కయ్యిమనే గులాబీ నేతలు తాము మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి మొత్తం దేశాన్ని రౌండప్ చేసేందుకు ప్లాన్లు వేయటాన్ని మాత్రం సమర్థించుకుంటారు. తాము చేస్తే సంసారం కానీ ఎదుటోడు చేస్తే మాత్రం అదేదో దరిద్రం అన్నట్లుగా వ్యవహరించే గులాబీ నేతలు.. ఖమ్మం లో నిర్వహించిన శంఖారావం సభ దెబ్బకు కిందా మీదా పడుతున్నారు.

ఇంతకాలం తెలుగుదేశం పార్టీని ఒక పార్టీగా గుర్తించేందుకు ఇష్టపడని గులాబీ నేతలకు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబును తిట్టటమే పనిగా పెట్టుకోవటం కనిపిస్తుంది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంపద మీద కన్నేసిన కొందరు ఏపీ నాయకులు క్యూ కట్టుకొని రాష్ట్రానికి వస్తున్నారని.. ప్రజలు మేలుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. మరి.. టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు చేస్తున్నదేమిటి?

తెలంగాణ సాధించటమే తన లక్ష్యమని చెప్పి.. తెలంగాణ సాధన తర్వాత బంగారుతెలంగాణ మాత్రమే తమ కర్తవ్యంగా చెప్పుకున్నారు. ఎనిమిదేళ్లు గడిచేసరికి తెలంగాణ అయిపోయింది. దేశం మొత్తాన్ని మార్చేయటమే తమ లక్ష్యంగా చెప్పటం తెలిసిందే. మరి.. గులాబీ అధినేత..

ఆయన అనుచర గణం దేశాన్నే టార్గెట్ చేసుకొన్న వేళ.. గంగుల చెప్పినట్లుగా వాళ్లు కూడా దేశ సంపదను కోసమే టార్గెట్ చేస్తున్నారా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. అందుకే అంటారు.. అనటం ఎందుకు? అనిపించుకోవటం ఎందుకు అని? ఆ మాటకు అర్థం గంగుల లాంటి వారికి ఇప్పటికైనా అర్థమై ఉంటుందా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.