Begin typing your search above and press return to search.

మోడీ-ఇమ్రాన్ ఖాన్ తేల్చుకోవాలన్న గంగూలీ

By:  Tupaki Desk   |   14 Nov 2021 11:30 PM GMT
మోడీ-ఇమ్రాన్ ఖాన్ తేల్చుకోవాలన్న గంగూలీ
X
భారత్ -పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ అంటేనే రెండు దేశాల క్రికెట్ అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. అంతటి హైఓల్టేజ్ మ్యాచ్ రెండు దేశాల ప్రజల మనోభావాలకు అద్దం పడుతుంది.ఇరు దేశాల క్రికెటర్లు తమ దేశ పరువుగా గెలుపును భావిస్తారు.

ఇటీవల ప్రపంచకప్ టీ20లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోవడంతో అంతా దుమ్మెత్తిపోశారు. ఓ మినీ యుద్ధంలా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేదు.

ప్రస్తుతానికి ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే భారత్-పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేవు. కశ్మీర్ సమస్య, ఉగ్రదాడులు, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తుండడంతో ఆ దేశంతో సంబంధాలను భారత్ ప్రభుత్వం తెంచుకుంది.

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య పరస్పరం పర్యటనలు ఇరు దేశాల బోర్డుల చేతుల్లో లేదు. ఇదే విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ సైతం స్పష్టం చేశాడు. పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాలనే నిర్ణయం తన చేతుల్లో లేదని స్పష్టం చేశారు. తన స్నేహితుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా సైతం ఈ విషయం ఏం చేయలేడని తేల్చిచెప్పాడు.

రెండు దేశాల ప్రభుత్వాలు.. ప్రధానులు మోడీ-ఇమ్రాన్ ఖాన్ చేతుల్లోనే భారత్-పాక్ సిరీస్ లు ఆధారపడి ఉన్నాయని.. వాళ్లే నిర్ణయం తీసుకోవాలని గంగూలీ స్పష్టం చేశారు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని.. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు.