Begin typing your search above and press return to search.
ఐపీఎల్ కు అన్ని దారులు మూసుకుపోయినట్లేనా..!
By: Tupaki Desk | 10 May 2021 3:51 AM GMTసమ్మర్ సీజన్ వస్తే చాలు ఐపీఎల్ ముంగిటకు వచ్చి కొన్నేళ్లుగా అలరిస్తూ వస్తోంది. అయితే గత ఏడాది కరోనా విజృంభణ కారణంగా టోర్నమెంట్ యూఏఈ లో నిర్వహించారు. అయితే ఈ ఏడాది కరోనా ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుని ఐపీఎల్ స్టార్ట్ చేశారు. మ్యాచ్ లు ఇంకా సగం కూడా పూర్తికాకముందే కరోనా దెబ్బకు లీగ్ నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పటివరకూ ఈ సీజన్లో 29 మ్యాచ్ లు మాత్రమే నిర్వహించారు.టోర్నమెంట్ రద్దు కావడంతో వివిధ దేశాల నుంచి వచ్చిన క్రికెటర్లు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు.
కరోనా వ్యాప్తి చూస్తుంటే ఇక ఇప్పట్లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించే పరిస్థితి లేదని వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ లో మిగిలిన మ్యాచ్ లు నిర్వహించాలని ఐపీఎల్ నిర్వాహకులు భావిస్తున్నప్పటికీ అప్పటికి కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చి ఉంటుందని అంటున్నారు. కరోనా ఈ రెండేళ్లలో ప్రతిసారి మార్చ్ లో వ్యాప్తి ప్రారంభం అవుతున్నప్పటికీ మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సెప్టెంబర్ నుంచే కేసులు రావడం మొదలవుతోంది. ఈ పరిస్థితుల్లో మిగిలిన మ్యాచ్ లను ఆడటం కోసం విదేశీ క్రికెటర్లు ఇండియాకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేదు.
ఇంగ్లాండ్, శ్రీలంక వంటి దేశాలు ఐపీఎల్ నిర్వహణకు ఆసక్తిగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడే ఐపీఎల్ నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు.తాజాగా ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడారు. న్యూజిలాండ్ తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, అనంతరం ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమిండియా జూన్ 2వ తేదీన ఇంగ్లాండ్ కు బయలుదేరనున్నట్లు ఆయన చెప్పారు.
అయితే ఆ తర్వాత జూలైలో భారత జట్టుపై శ్రీలంక లో పర్యటించి మూడు వన్డేలు, ఐదు టీ 20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.అయితే ఇంగ్లాండ్ కి వెళ్ళిన ఆటగాళ్ళు సెప్టెంబర్ 14 వరకు అక్కడే ఉంటారు కనుక శ్రీలంకతో జరిగే సిరీస్ లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక కానీ ధావన్, హార్దిక్, పృథ్వీ షా, సూర్య కుమార్, చాహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లను పంపించే అవకాశం ఉంది.
అయితే ఐపీఎల్లో మిగిలిపోయిన 31 మ్యాచ్ లను కచ్చితంగా ఫలానా సమయంలో నిర్వహిస్తామని చెప్పడం తొందరపాటు అవుతుందని గంగూలీ పేర్కొన్నారు. ఇక అప్పట్లో ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడం అసాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వీక్షించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి షా వెళుతుండటంతో ఇంగ్లాండ్ లోనే ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది.. అనే విషయమై ఆ బోర్డుతో వారు చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.