Begin typing your search above and press return to search.
వైసీపీలో వంశీ ముసలం.. పెరుగుతున్న విభేదాలు
By: Tupaki Desk | 11 Jun 2022 10:37 AM GMTరాజకీయాల్లో ఏ నాయకుడితో అయినా.. పార్టీకి ప్రయోజనం ఉండాలి. లేదా.. సదరు నేత వల్ల.. ఆ నియోజ కవర్గంలో పార్టీకైనా ప్రయోజనం ఉండాలి. కానీ, ఈ రెండు లేకపోగా.. పార్టీకే నష్టం వచ్చేలా వ్యవహరిస్తున్న పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది.
గత 2019 ఎన్నికల్లోటీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ.. గన్నవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అప్పట్లో కమ్మ సామాజిక వర్గంపై వైసీపీ కత్తికట్టిందనే వాద న వినిపించింది. ఈ సమయంలో కమ్మ వర్గానికి చెందిన వల్లభనేనిని.. వైసీపీకి అనుకూలంగా మార్చుకు న్నారు.
ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా ఉన్న కమ్మవర్గాన్ని టార్గెట్ చేసి.. ఆ పార్టీకి కమ్మవారిని దూరం చేసేం దుకు వంశీ ఉపయోగపడతారని.. వైసీపీ అధినేత జగన్ భావించి ఉంటారనే చర్చ తెరమీదికి వచ్చింది. అయితే.. జగన్ ఏం ఆశించారో తెలియదుకానీ.. వంశీ వల్ల వైసీపీలో విబేదాలు.. వివాదాలు.. రోజుకో రచ్చ తెరమీదకి వస్తున్నాయి. గన్నవరం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. స్థానికంగా ఇక్కడ వైసీపీకి మద్దతుదారులుగా ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ముందు నుంచి వంశీని వ్యతిరేకిస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. వంశీ దూకుడుగా ఉండి.. తమపై కేసులు పెట్టించారని వారు చెబుతు న్నారు. అదేసమయంలో జగన్‌ను కూడా ఆయన నానా బూతులు తిట్టారని.. అలాంటి వంశీతో కలిసి పని చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం అధికార పార్టీలో ఇంటిపోరు రోజు రోజుకీ ముదురుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు లకు పడడం లేదు.
అయితే.. వాస్తవానికి వైసీపీ తీర్థం పుచ్చుకని వంశీ.. రెండేళ్లు అయిపోయింది. అయినా..కూడా ఎక్కడా పా ర్టీ తరఫున ఆయన పనిచేసింది.. లేదు. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన జనం వద్దకు వెళ్లింది లే దు. స్థానికంగా పార్టీని బలోపేతం చేసింది లేదు. కార్యక్రమాలు చేసింది లేదు. కార్యకర్తలను కలుపుకొని పోయింది లేదు. అడుగడుగునా విమర్శలు.. ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు.. పంచాయ తీలు తెరమీదికి వస్తున్నాయి.
ఇప్పటికే ఒకసారి అధిష్టానం.. ఈ ముగ్గురునేతలతో చర్చించింది కూడా. అయినా... వంశీ ఎక్కడా తగ్గడం లేదు. తనే లేఏకపోతే.. గన్నవరం లేదని.. తననే గెలిపిస్తారనే ధీమా ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే వైసీపీ నాయకులను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. కూ డా చెబుతున్నారు. ఇది అంతిమంగా పార్టీకి మరింత బ్యాడ్ చేయడమే తప్ప మరొకటి కాదని అంటున్నా రు పరిశీలకులు.