Begin typing your search above and press return to search.

గన్నవరం ఎన్నిక రెఫరెండమా? వంశీ నెగ్గుతాడా?

By:  Tupaki Desk   |   2 Aug 2020 5:31 PM GMT
గన్నవరం ఎన్నిక రెఫరెండమా? వంశీ నెగ్గుతాడా?
X
వల్లభనేని వంశీ.. ఈ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వైసీపీకి జైకొట్టారు. తాజాగా ఉప ఎన్నికకు సిద్ధమంటూ తొడగొట్టేశారు. ఇంతకీ వంశీ గెలుస్తాడా? ఉప ఎన్నికల్లో నిలబడుతాడా? అనేది చర్చనీయాంశంగా మారింది. వంశీకి నియోజకవర్గంలో ఇప్పుడు రెండు వర్గాలు గెలుపును అడ్డుకునేలా కనిపిస్తున్నాయంటున్నారు. వారిని జయించి నిలుస్తాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. తాజాగా తాను గెలుస్తానంటూ.. తన ఎన్నికను రెఫరెండంగా వంశీ ప్రకటించడం రాజకీయ వర్గాల్లో నెలకొంది.

టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం ఉప ఎన్నికలకు సిద్ధమంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. కరోనా కారణంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు అని ఆగానని వివరించారు. రాజధాని తరలింపు తన ప్రాంత రైతులు కొంత నష్టపోయారని.. అందుకే నా ఉప ఎన్నిక ఫలితాన్ని రాజధాని మార్పుపై ప్రజాభిప్రాయంగా చూసినా నాకు సమ్మతమేనని అన్నారు. గన్నవరం ఉప ఎన్నికను రాజధాని మార్పుతో ముడిపెట్టాలా వద్దా అనేది టీడీపీ తేల్చుకోవాలని అన్నారు.

గన్నవరం ఎన్నికను రెఫరెండంగా ప్రకటించిన వంశీకి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు. ఆయనకు నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలంగా తయారవుతున్నారు. గన్నవరంలో ఒకప్పుడు వెలుగువెలిగి రాజకీయంగా తెరమరుగైన వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రాంచంద్రరావు వర్గం ఇప్పుడు మరోసారి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా దుట్టా అల్లుడు , వైసీపీ వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శివభరత్ రెడ్డి హైదరాబాద్ నుంచి డాక్టర్ వృత్తిని పక్కనపెట్టి గన్నవరంకు వచ్చేశారు. వైసీపీ గెలవడంతో పూర్తి స్థాయి గన్నవరం రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ఇప్పుడు వల్లభనేని వంశీ, శివభరత్ రెడ్డి మధ్య రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.

దుట్టా అల్లుడు శివభరత్ రెడ్డి సీఎం జగన్ కు బంధువునంటూ గన్నవరం నియోజకవర్గంలో వంశీ అంటే పడని వర్గాలను చేరదీస్తూ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. వైసీపీ నిజమైన నాయకులను తనవైపుకు తిప్పుకొని సొంతంగా బలపడుతున్నారట..

ఈ క్రమంలో ఈ విభేదాలపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డితో దుట్టా వర్గం భేటి అయ్యింది. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే తమకే టికెట్ ఇవ్వాలంటూ షరతు విధించినట్లు సమాచారం. వంశీకి టికెట్ ఇస్తే సహకరించమని.. ఓడిస్తామని తేల్చిచెప్పినట్టు ప్రచారం సాగుతోంది.

కానీ వంశీకి పోటీగా దుట్టా వర్గం గట్టిగా గన్నవరంలో హీట్ పెంచుతోంది. వచ్చే ఉప ఎన్నికల్లో వంశీకి అంత ఈజీగా నియోజకవర్గంలో పరిస్థితులు ఉండేలా కనిపించడం లేదని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇక టీడీపీ ఎలాగూ పోటీలో ఉంటుంది.. దీంతో గన్నవరంను బీరాలకు పోయి రాజధాని మార్పుపై రెఫరెండం పెడితే వంశీకి భంగపాటు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.