Begin typing your search above and press return to search.
కన్ఫ్యూజ్ చేస్తున్న గంటా..బాబు కోసమేనా...?
By: Tupaki Desk | 4 Jan 2022 11:30 AM GMTఏపీ రాజకీయాల్లో ఏ మాత్రం క్లారిటీ లేకుండా రాజకీయం చేస్తున్న నాయకుడు గంటా శ్రీనివాసరావు అని చెప్పొచ్చు. ఎందుకంటే 2019 తర్వాత నుంచి ఆయన ఎప్పుడు ఎలా రాజకీయం చేస్తున్నారో అర్ధం కాకుండా ఉంది. గంటా కు రాజకీయంగా ఫుల్ క్లారిటీ ఉండొచ్చు.. కానీ జనాలకు మాత్రం క్లారిటీ లేకుండా చేస్తున్నారు. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నారు? ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో? ఎవరికి అర్ధం కావడం లేదు.
అసలు 2019 ఎన్నికల నుంచి గంటా అలాగే రాజకీయం చేస్తున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి... టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఇక ఈయన ఆ పార్టీలోకి వెళ్తారని, ఈ పార్టీలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదిగో వైసీపీలోకి వెళ్ళడం ఫిక్స్ అయిపోయింది... రేపో మాపో జాయిన్ అయిపోతారని ప్రచారం జరిగింది. కానీ ఈయన ఎటు వెళ్లలేదు. మధ్యలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు అడ్రెస్ లేకుండా వెళ్ళిపోయారు.
కానీ ఈ మధ్య మళ్ళీ గంటా టీడీపీలో కనిపిస్తున్నారు. ఇక ఇంతవరకు ఎన్ని సంఘటనలు జరిగిన స్పందించని గంటా..తాజాగా మాచర్లలో ఒక వైసీపీ నాయకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టిన అంశం పై స్పందించారు. తెలుగు జాతికి గర్వకారణమైన ఎన్టీఆర్ విగ్రహాన్ని బద్దలగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు ఇంతవరకు దేనిపైన పెద్దగా స్పందించని నేత ఇప్పుడు సడన్‌గా స్పందించడంతో టీడీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. అసలు ఈయన వెర్షన్ ఏంటో క్లారిటీ లేదని అనుకుంటున్నారు.
పైగా ఇటీవల కాపు నేతల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో కాపు నేతలంతా ఒకచోట కలిశారు. అందులో గంటా కూడా ఉన్నారు. కాపులకు ప్రాధాన్యత దక్కడం కోసమే గంటా..అందరు కాపు నేతలని కలిపినట్లు తెలుస్తోంది. అయితే కాపులని ఏకం చేస్తున్నది మళ్ళీ చంద్రబాబుని అధికారంలోకి తీసుకురావడం కోసమనే ప్రచారం కూడా ఉంది. అలాగే బాబు-పవన్‌లని కలిపే పనిలో ఉన్నారని తెలిసింది. మొత్తానికైతే గంటా పాలిటిక్స్ ఏ మాత్రం క్లారిటీ లేవు.