Begin typing your search above and press return to search.
పొలిటికల్ రిస్కుల్లో గంటా.. ఫ్యూచరేంటి?
By: Tupaki Desk | 20 Aug 2021 1:50 AM GMTమాజీ మంత్రి దాదాపు రెండు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.. ఉన్న నాయకుడు.. కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు.. ఇప్పుడు ఒంటరయ్యారా? ఆయనను నమ్ముకున్నవారు.. ఆయన నమ్ము కున్నవారు.. కూడా ఇప్పుడు గంటాకు దూరమయ్యారు. దాదాపు 20 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఉన్న గం టా.. ఎక్కడా స్థిరమైన రాజకీయాలు చేయక పోవడం గమనార్హం. తన సొంత ఇమేజ్‌తో నెట్టుకొచ్చే తత్వం ఉన్న గంటా.. ఇప్పటి వరకు ఓటమి మాటే ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు.
ఈనాడులో విలేకరిగా జీవితాన్ని ప్రారంభించిన గంటా శ్రీనివాసరావు.. తొలుత బీజేపీ ద్వారా.. రాజకీయ అరంగేట్రం చేశారు. అయితే.. ఆ తర్వాత..చంద్రబాబు పిలుపుతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆయన 1999 లో తొలిసారి టీడీపీ టికెట్‌పై విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. నిజానికి గంటా రాజకీయాలను పరిశీలిస్తే.. ఆయన ఎప్పుడూ.. పార్టీలను నమ్ముకోకుండా.. వ్యక్తిగతంగా ఇమేజ్‌ను సొంతం చేసుకునే ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన ఏ నియోజకవర్గం నుంచిపోటీ చేసినా గెలుపు గుర్రం ఎక్కుతున్నారు.
2004 ఎన్నికల్లో ఆయన విశాఖ జిల్లా చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. అయితే.. అప్పటికే ఆయన మంత్రి పీఠంపై కన్నేయడం.. తన ఆకాంక్షను నెరవేర్చుకోవాలని అనుకున్న క్రమంలో.. టీడీపీ ఓడింపోయి.. కాంగ్రెస్ గెలుపుగుర్రం ఎక్కింది. దీంతో విపక్షానికే గంటా పరిమితమయ్యారు. ఇక 2009 నాటికి టీడీపీని వీడిన ఆయన కాపు పిలుపుతో.. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరారు. ఈ క్రమంలో ప్రజారాజ్యం టికెట్‌పై మరోసారి ఎమ్మెల్యేగాఆ ఆయన విజయం దక్కించుకున్నారు.
అయితే.. తర్వాత కాలంలో ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడం.. అప్పటికే చిరంజీవి.. గంటాకు మంత్రి పీఠంపై హామీ ఇవ్వడం(అంటే.. చిరంజీవి అధికారంలోకి వస్తే) తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో గంటా మంత్రి పదవిని చేపట్టారు. ఆ తరువాత 2014 నాటికి రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన గంటా.. మళ్ళీ టీడీపీలో చేరారు. ఆ క్రమంలోనే భీమిలి నుంచి టీడీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్న ఆయన ఐదేళ్లపాటు.. విద్యాశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇలా.. పార్టీ ఏదైనా.. గెలుపు మంత్రంతో దూసుకుపోవడం.. తనుకున్న విధంగా.. మంత్రి పదవిని దక్కించుకోవ డం గంటాకు రాజకీయంగా కలిసి వచ్చిన అంశం అంటారు పరిశీలకులు.
ఇక, ఇప్పుడు పరిస్థితి ఏంటి? 2019 ఎన్నికలకు ముందుగానే గంటాకు వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. అయితే. .ఆ యన దానిని తిరస్కరించారు. ఈ క్రమంలోనే అవంతి శ్రీనివాసరావును వైసీపీ తీసుకుంది. ఇక, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచిన గంటా.. అప్పటి నుంచి ఆపార్టీకి తటస్థంగా ఉన్నారు. ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట ఆయన వైసీపీలో చేరుతున్నారని.. వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై గంటా ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఈ లోగా విశాఖ ఉక్కు ఉద్యమం తెరమీదికి రావడంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక, అప్పటి నుంచి మళ్లీ ఎక్కడా గంటా ప్రస్తావన రాజకీయాల్లో వినిపించడం లేదు. ఇటు టీడీపీ కానీ, అటు వైసీపీ కానీ.. గంటా గురించిన చర్చచేయడంలేదు. మరోవైపు గంటా అనుచరులు.. పూర్తిగా.. పార్టీ మారిపోయి.. వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన ఫ్యూచరేంటి? 2024 నాటికి గంటా ఏ పార్టీలో ఉంటారు? అనే చర్చ జోరుగా సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.