Begin typing your search above and press return to search.
తిరుపతి ఉప ఎన్నికల బరిలో గంటా?
By: Tupaki Desk | 14 March 2021 6:30 AM GMTఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండే గంటా.. అందుకు భిన్నంగా కొంతకాలంగా కామ్ గా ఉంటున్నారు. తాజాగా హాట్ టాపిక్ గా మారిన విశాఖ ఉక్కు సంస్థను ప్రవైటీకరణ చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టిన గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ ను తన రాజీనామా పత్రాన్ని పంపారు.
టీడీపీలో కొనసాగుతున్న ఆయన.. అధికార వైసీపీలో చేరేందుకు పలు ప్రయత్నాలు చేసినట్లు చెబుతారు. అందుకు ఓకే అని చెప్పినట్లే చెప్పి.. మళ్లీ వెనక్కి తగ్గటంతో.. సరైన హామీ లభించకపోవటంతో ఆయన వైసీపీలోకి చేరలేదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. విశాఖ ఉక్కు సంస్థను నిలుపుకోవటంపై ఏపీలోని వారంతా తీవ్రంగా తపిస్తున్న వేళ.. తాను తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో గంటా ఉన్నట్లు చెబుతున్నారు.
విశాఖ ఉక్కు సంస్థను దక్కించుకోవటం కోసం తమ పదవుల్ని వదులుకోవాలని అధికార.. విపక్ష నేతలపై ఒత్తిడి ఉన్నా.. అందరూ ఏదో ఒక మాట చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ.. గంటా మాత్రం అందుకు భిన్నంగా తన పదవికి రాజీనామా చేసి మిగిలిన నేతలకు తనకు మధ్య తేడాను చేతల్లో చూపించారు. తిరుపతి ఉప పోరులో అధికార వైసీపీ.. విపక్ష టీడీపీతో పాటు బీజేపీ సైతం పోటీకి దిగనుంది.
వాస్తవానికి విశాఖ ఉక్కు సంస్థపై కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా అఖిలపక్షం ఒక అభ్యర్థిని బరిలోకి దించితే బాగుంటుంది. అందుకు భిన్నంగా.. ప్రతిపార్టీ బరిలోకి దిగనున్న నేపథ్యంలో.. తాను కూడా దిగాలన్న యోచనలో గంటా ఉన్నట్లుచెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో తనకెంతో అనుబంధం ఉందని చెప్పే గంటా.. తిరుపతి ఉప ఎన్నిక బరిలో నిలిస్తే విశాఖ ఉక్కు నినాదాన్ని జాతీయస్థాయిలో వినిపించే వీలుందన్నఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఉక్కు కోసం పదవుల్ని వదిలేసిన వారిలో మొదటి వ్యక్తిగా గంటా నిలుస్తున్నారు. తిరుపతి బరిలో నిలవటం ద్వారా తన సత్తానుచాటటంతో పాటు.. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాలన్నది ఆయన ఆలోచన. మరి.. గంటా వ్యూహాన్ని అమలయ్యేలా పరిణామాలు ఉంటాయా? ఇంకేమైనా ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.