Begin typing your search above and press return to search.

గంటా క‌నిపించ‌టం లేదు.. బాబుకు హైటెన్ష‌న్!

By:  Tupaki Desk   |   13 March 2019 5:31 AM GMT
గంటా క‌నిపించ‌టం లేదు.. బాబుకు హైటెన్ష‌న్!
X
కీల‌క‌మైన వేళ ఎన్నిక‌ల బ‌రిలో దిగే అభ్య‌ర్థుల విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీసుకునే నిర్ణ‌యాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఎవ‌రి ఒత్తిడికి లొంగ‌న‌ని చెప్పేఆయ‌న‌.. ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. గెలుపు గుర్రాల్ని బ‌రిలోకి దించుతాన‌ని చెబుతూనే.. ప‌లు ఒత్తిళ్ల‌కు లోన‌వుతూ ఆఖ‌రి నిమిషాల్లో అనూహ్య నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఆయ‌న‌కో అల‌వాటు.

పార్టీకి అండ‌గా ఉండే వారి కంటే ఆఖ‌ర్లో టికెట్ల కోసం వ‌చ్చే వారికి పెద్ద పీట వేయ‌టం కూడా బాబుకు అల‌వాటు అన్న విమ‌ర్శ ఉంది. దీనికి త‌గ్గ‌ట్లే.. తాజాగా జ‌రుగుతున్న ఏపీ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో బాబు అనుస‌రిస్తున్న తీరు ప‌లు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇస్తోంది. ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు సీటు విష‌యంలో బాబు అనుస‌రిస్తున్న తీరుపై ఆయ‌న గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతారు.

విశాఖ జిల్లా భీమిలి స్థానంలో త‌న కుమారుడు క‌మ్ ఐటీ మంత్రి లోకేష్ ను పోటీకి దించే విష‌య‌మై బాబు తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే స‌మ‌యంలో భీమిలి స్థానంలో లోకేష్ కు బ‌దులుగా సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కేటాయించాల‌న్న మాట ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాను ఖాయంగా గెలిచే సీటును చిన‌బాబు కోసం త్యాగం చేయ‌మంటే ఓకే కానీ..ఎవ‌రికోస‌మో తాను వ‌దులుకోవ‌టంలో అర్థం లేద‌న్నట్లుగా గంటా ఆలోచ‌న‌గా చెబుతున్నారు. మ‌రోవైపు.. గంటాను విశాఖ ఎంపీగా బ‌రిలోకి దింపాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్నారు. అయితే.. ఈ ప్ర‌తిపాద‌న‌కు గంటా గుర్రుతో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

త‌న‌కు ఎంపీగా పోటీ చేయ‌టం ఇష్టం లేద‌న్న విష‌యాన్ని అధినేత‌కు ఇప్ప‌టికే తెలియ‌జేసిన‌ట్లు తెలుస్తోంది. కానీ.. బ‌ల‌మైన అభ్య‌ర్థి బ‌రిలో నిల‌వాలంటే గంటా పోటీ చేయ‌క త‌ప్ప‌ద‌న్న మాట చంద్ర‌బాబు చెప్పిన‌ట్లుగా స‌మాచారం. దీంతో మ‌న‌స్తాపానికి గురైన గంటా నిన్న‌టి నుంచి క‌నిపించ‌ట్లేదని చెబుతున్నారు.

అమ‌రావ‌తికి వెళుతున్న‌ట్లు చెప్పిన ఆయ‌న అక్క‌డికి వెళ్ల‌కుండా హైద‌రాబాద్ కు వెళ్లార‌ని.. ఎవ‌రికి ట‌చ్ లోకి వెళ్ల‌కుండా ఉన్న ఆయ‌న వ్య‌వ‌హారం ఏపీ ముఖ్య‌మంత్రికి ఇబ్బందిక‌రంగా మారుతున్న‌ట్ఉ చెబుతున్నారు. త‌న‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వాడేయ‌టంపై ఆగ్ర‌హంగా ఉన్న గంటా.. అవ‌స‌ర‌మైతే పార్టీ మారైనా స‌రే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని స‌న్నిహితుల వ‌ద్ద చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అదే జ‌రిగితే.. బాబుకు భారీ డ్యామేజ్ త‌ప్ప‌ద‌ని చెప్ప‌కత‌ప్ప‌దు. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ఇప్పుడు గంటా ఎక్క‌డ ఉన్నార‌న్న‌ది బాబు బ్యాచ్ కు పెద్ద టెన్ష‌న్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.