Begin typing your search above and press return to search.
జగన్.. రాక్షసుడంట
By: Tupaki Desk | 8 Jun 2016 2:17 PM GMTఅధికార.. విపక్షాల మధ్య విమర్శలు.. ప్రతివిమర్శలు మామూలే. కానీ.. ఏపీలో పరిస్థితి చూస్తుంటే కాస్త మోతాదు మించినట్లుగా కనిపిస్తోంది. ఇష్టారాజ్యంగా తిట్టేసుకోవటంలో ఒకరి కంటే ఒకరు ఘనులన్నట్లుగా అధికార.. విపక్ష నేతలు వ్యవహరిస్తున్నారు. మొన్నా మధ్య తన అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి.. విపక్ష నేత జగన్ ఎంతలా తిట్టిపోశారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పులతో మొదలు పెట్టి.. చీపుర్లో కొట్టాలంటూ కసిదీరా తిట్టేశారు. ఇదిలా ఉంటే.. దానికి బదులు అన్నట్లుగా ఏపీ అధికారపక్ష నేతలు జగన్ పై తీవ్ర విమర్శలే చేశారు.
దీనికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా మంత్రి గంటా మరోసారి జగన్ తీరును మండిపడుతూ.. ఆయన్ను రాక్షసుడిగా అభివర్ణించటం గమనార్హం. ఏపీ సర్కారు తాజాగా నిర్వహిస్తున్న మహా సంకల్ప యాత్ర వేదికపై నుంచి మాట్లాడిన మంత్రి గంటా.. విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఏపీ సర్కారు కృషి చేస్తుందని.. కానీ ఏపీ సర్కారు చిత్తశుద్ధిని.. అనుభవం లేని అసమర్థ నేత పాడు చేస్తున్నారన్నారు.
దేవతలు మంచిపనులు చేస్తుంటే రాక్షసులు వాటిని పాడు చేయటానికి ప్రయత్నిస్తుంటారని.. రుషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వాటిని పాడు చేసే వారని.. జగన్ కూడా అలాంటివాడేనని వ్యాఖ్యానించారు. జగన్ భాష అభ్యంతరకరంగా ఉందని.. ఆయన ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ రాక్షసుడిలా వ్యవహరిస్తు అభివృద్ధి కార్యక్రమాల్ని అడ్డుకుంటున్నారని విరుచుకుపడ్డారు. ఇక.. దీక్ష ఇష్యూ గురించి మాట్లాడిన ఆయ.. అందరూ రాష్ట్ర అవతరణ దినోత్సవం పేరిట పండుగలు చేసుకుంటుంటే.. ఏపీ ప్రజలు మాత్రం దీక్షలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించి.. రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితి చాలా చిత్రమైనదిగా వ్యాఖ్యానించారు. విభజన కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మళ్లీ.. మళ్లీ గుర్తు తెచ్చుకుంటూ కసితో అభివృద్ధి చేయాలనే దీక్షను చేపట్టినట్లుగా చెప్పారు. మాటల్లో కసి ఓకే కానీ గంటా.. చేతల్లోనూ అంతే కసి ఉందంటారా..?