Begin typing your search above and press return to search.

మళ్లీ పార్టీ పెద్దలకు షాకిచ్చిన గంటా!!

By:  Tupaki Desk   |   20 March 2021 2:30 AM GMT
మళ్లీ పార్టీ పెద్దలకు షాకిచ్చిన గంటా!!
X
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మళ్లీ పార్టీ పెద్దలకు షాకిచ్చాడు. పార్టీలో ఉంటున్నాడో లేదో తెలియకుండానే వ్యవహరిస్తున్న గంటా ఈ మధ్య రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి మరీ విశాఖ ఉక్కు రాజకీయాలను వేడెక్కించారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి తాజాగా మున్సిపల్ మేయర్ ఎన్నిక సమయంలో గంటా పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

దాదాపు 9 ఏళ్ల తర్వాత విశాఖ మహానగర పాలక సంస్థకు ఎన్నికలు జరిగి కొత్తగా మేయర్ ఎన్నిక వేళ ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా గంటా ఓటు కీలకం. అలాంటి గంటా హాజరై టీడీపీ కార్పొరేటర్లకు మద్దతుగా రాజకీయం చేస్తాడని అంతా అనుకున్నారు.

మేయర్ ను కైవసం చేసుకుంటామని బీరాలు పలికిన టీడీపీ తరుఫున ఎక్స్ అఫీషియో మెంబర్ గా గంటా ఓటు కీలకం. విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలవగా.. విశాఖ సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇప్పటికే వైసీపీలో చేరి ఆ పార్టీ జెండానే కప్పుకొని వచ్చేశాడు. ఇక గంటా శ్రీనివాసరావు మాత్రం ఈ కీలక ఎన్నికకు డుమ్మా కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నీ తెలిసి కూడా టీడీపీ కార్పొరేటర్ల తరుఫున గంటా అండగా నిలబడకపోవడమే ఇప్పుడా పార్టీలో చర్చనీయాంశమైంది.గంటా టీడీపీలో ఉన్నాడా? లేదా వైసీపీకి మద్దతుగా ఉన్నాడా? అన్నది కూడా తెలియడం లేదు. డుమ్మా కొట్టి మళ్లీ టీడీపీ బ్యాచ్ కు షాకిచ్చారు గంటా..