Begin typing your search above and press return to search.
‘గంటా’ మౌనం.. టీడీపీ అల్లకల్లోలం..!
By: Tupaki Desk | 6 Nov 2019 8:34 AM GMTఏపీలో ఇసుక కొరతపై పవన్ తలపెట్టిన లాంగ్ మార్చ్ సక్సెస్ అయ్యింది. ఆయితే ఆ లాంగ్ మార్చ్ కేంద్రం పొడచూపిన విభేదాలు మాత్రం ఇప్పుడు టీడీపీని అల్లకల్లోలం చేస్తున్నాయి. స్వయంగా జనసేనాని పవన్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మరీ తన లాంగ్ మార్చ్ కు మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. దానికి బాబు కూడా సరేనన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన దిగ్గజ నేతలు అచ్చెన్నా, అయ్యన్నలాంటి ఉద్దండులను పంపారు. అయితే విశాఖలోనే ఉన్న సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మాత్రం పవన్ లాంగ్ మార్చ్ వైపు కన్నెత్తి చూడలేదు. మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణమిచ్చే మాజీ మంత్రి గంటా ఆయన తమ్ముడు పోరాటానికి మాత్రం మద్దతు ఇవ్వకపోవడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించినా కూడా గంటా విశాఖలోనే ఉన్నా పవన్ ఆందోళనలో పాలుపంచుకోవడం చర్చనీయాంశమైంది.
పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తున్నప్పుడు గంటా శ్రీనివాసరావు విశాఖలోనే ఉండడం గమనార్హం. ఆయనకు వేరే పనులు ఏవీ లేకున్నా కూడా పవన్ లాంగ్ మార్చ్ లో పాల్గొనలేదు. పవన్ లాంగ్ మార్చ్ కు టీడీపీ తరుఫున అయ్యన్న, అచ్చెన్న, గంటా హాజరవుతారని చంద్రబాబు చెప్పడంతో జనసేన శ్రేణులు ఈ ముగ్గురి పేర్లను వేదికపై ఉంచారు. కానీ గంటా మాత్రం చంద్రబాబు ఆదేశాలను కూడా పాటించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
గంటా శ్రీనివాసరావు టీడీపీలో కొద్దికాలంగా అసంతృప్తితో ఉంటున్నారు. అప్పట్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో కలిసి చర్చలు జరిపారు. గంటాతోపాటు పది మంది వరకూ కూడా టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో గంటా టీడీపీని వీడలేదు. బీజేపీలో చేరలేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వ్యూహాత్మకంగా వెళ్లి మంత్రి పదవులు అనుభవించే గంటా లెక్క ఈసారి తప్పింది. ఆయనను వైసీపీలోకి తీసుకునే చాన్స్ లేదు. రాజీనామా చేస్తే గానీ జగన్ రానీవ్వరు. దీంతో అధికారానికి దూరంగా టీడీపీలో ఉండలేకపోతున్నారు. అటూ బీజేపీ, వైసీపీలోకి చేరలేకపోతున్నారన్న చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న పార్టీ సర్వసభ్య సమావేశానికి కూడా గంటా హాజరు కావడం లేదు. దీంతో గంట పార్టీ మారుతారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.