Begin typing your search above and press return to search.

గంటా టీడీపీకి దూరమైపోయినట్లేనా ?

By:  Tupaki Desk   |   19 Oct 2020 11:03 PM IST
గంటా టీడీపీకి దూరమైపోయినట్లేనా ?
X
మాజీమంత్రి, విశాఖనగరం తెలుగుదేశంపార్టీ నార్త్ ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు పార్టీకి దూరమైపోయినట్లేనా ? క్షేత్రస్ధాయిలో తాజాగా జరిగిన డెవలప్మెంట్ ను చూసిన తర్వాత పార్టీ నేతల్లోనే ఈ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ తాజాగా జరిగిన డెవలప్మెంట్ ఏమిటయ్యా అంటే విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన భారీ కార్యక్రమంలో గంటా ఎక్కడా కనబడలేదు. దాంతో సీనియర్ నేతలందరికీ అనుమానాలు పెరిగిపోయాయి.

పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులను చంద్రబాబునాయుడు నియమించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సోమవారం పార్టీ కార్యక్రమంలో అధ్యక్షులుగా నియమితులైన వారంతా బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి అబ్జర్వర్ గా మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా హాజరయ్యారు. దాదాపు ఉత్తరాంధ్ర నుండి కొందరు నేతలు హాజరయ్యారు. ఇంతమంది హాజరైన ఈ కార్యక్రమంలో నగరంలోనే ఎంఎల్ఏగా ఉంటున్న గంటా మాత్రం ఎక్కడా కనబడలేదు.

చాలా కాలంగా గంటా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. పైగా ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళ లెక్కలో కాకుండా ఏకంగా ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసేస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. మరి ప్రచారం ఎఫెక్టో లేకపోతే నిజంగానే టీడీపీలో కంటిన్యు అవ్వలేకే గంటా కార్యక్రమానికి హాజరుకాలేదో అర్ధం కావటం లేదు. మొత్తానికి గంటా ఏదో రూపంలో వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తున్నదైతే వాస్తవం.