Begin typing your search above and press return to search.

జంపింగ్‌పై గంటా 'రాజ‌కీయం'

By:  Tupaki Desk   |   5 Jan 2023 7:48 AM GMT
జంపింగ్‌పై గంటా రాజ‌కీయం
X
''ఆయ‌న పార్టీలో ఉన్నారా? లేరా? అంటే.. ఉన్నారు కాబ‌ట్టి ఉన్నారని, పార్టీకి, పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరం గా ఉన్నారు కాబ‌ట్టి లేర‌ని.. అనుకోవాలి!''- అంటున్నారు టీడీపీ నాయ‌కులు. మాజీ మంత్రి, ప్ర‌స్తుతం విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు గురించే ఈ చ‌ర్చ అంతా!! ఆయ‌న రాజ‌కీయం 2019 నుంచి ఇలా దాగుడు మూత‌లుగా నే ఉంది.

టీడీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న గంటా.. వైసీపీలోకి మార‌నున్నార‌ని.. 2020-21 మధ్య తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఆయ‌న కొంద‌రిని వెంట‌బెట్టుకుని గోవా ట్రిప్‌కు వెళ్ల‌డం.. కూడా అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపింది. అయితే.. ఆయ‌న పార్టీ మార‌లేదు. అలాగ‌ని మార‌బోన‌ని.. కూడా చెప్ప‌లేదు. ఇదిలా వుంటే, విశాఖ ఉక్కు ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇది కూడా ఆమోదం పొంద‌లేదు.

కానీ, రాజ‌కీయంగా మాత్రం గంటా వ్య‌వ‌హారం ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. ఇటీవ‌ల ఆయ‌న కొత్త సంవ‌త్స‌రంగ్రీటింగ్ కార్డుల‌ను త‌న అభిమానులు. పార్టీ నేత‌ల‌కు, స్నేహితుల‌కు కూడా పంపించారు. దీని పై చంద్ర‌బాబు ఫొటోను ముద్రించారు. అంటే.. ఆయ‌న పార్టీలోనేకొన‌సాగుతున్న‌ట్టు భావించాలి. కానీ, ఇంత‌లోనే.. ఆయ‌న వైసీపీలోకి చేరిపోతున్నార‌ని.. దీనికి సంబంధం బ్యాక్ గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయిపో యింద‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు.

సీఎం జ‌గ‌న్‌.. గంటా రాక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని.. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఉత్త‌రాంధ్ర‌కు చెందిన సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కూడా చ‌ర్చ‌లు జ‌రిపార‌ని ఓ వ‌ర్గం సోష‌ల్ మీడియాలో వార్త‌లు విశాఖ‌లో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఉత్త‌రాంధ్ర వైసీపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా ఉన్న టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కూడా చ‌ర్చించార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. దీనిపై ఇటు గంటా కానీ, అటు వైసీపీ కానీ, మ‌రోవైపు.. టీడీపీ కానీ, నోరు విప్ప‌డం లేదు.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మ‌రోవైపు కాపు సంక్షేమం కోసం.. గంటా ప్ర‌త్యేకంగా భేటీలు నిర్వ‌హిస్తున్నారు. గ‌త డిసెంబ‌రు 26న కాపు నాయ‌కుడు, విజ‌య‌వాడ‌కు చెందిన వంగ‌వీటి రంగా వ‌ర్ధంతిని న‌నిర్వ‌హించారు. అదేస‌మ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబు ఫొటోతో ఉన్న గ్రీటింగ్‌కార్డుల‌ను పంచారు. ఈ ప‌రిణామాలు చూస్తే.. ఆయ‌న టీడీపీని వీడి వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదనే సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింది.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమిలి టికెట్ లేదా.. చోడ‌వ‌రం, అన‌కాప‌ల్లి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల కింద‌ట గంటాకు సంబంధించిన ఒక వీడియోను టీడీపీ నేత‌లు స‌ర్క్యులేట్ చేశారు. దీనిలో ఆయ‌న స్ప‌ష్టంగా .. తాను టీడీపీని వీడి పోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. తాను చంద్ర‌బాబుతోనే క‌లిసి ప్ర‌యాణిస్తాన‌ని కూడా చెప్పారు.

''సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని నేను ప‌ట్టించుకోను. నేను టీడీపీలో కొన‌సాగుతాను'' అన గంటా వ్యాఖ్యానించారు. అయితే.. దీనిని వైసీపీ నాయ‌కులు మాత్రం కొట్టి పారేస్తున్నారు ఇది.. పాత వీడియో అని చెబుతున్నారు. దీంతో గంటా రాజ‌కీయంగా దాగుడు మూత‌లు ఆడుతున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.