Begin typing your search above and press return to search.

ఒకేసారి తాత‌లైన ఇద్ద‌రు ఏపీ మంత్రులు

By:  Tupaki Desk   |   14 Jun 2017 5:20 AM GMT
ఒకేసారి తాత‌లైన ఇద్ద‌రు ఏపీ మంత్రులు
X
ఏపీ మంత్రులు ఇద్ద‌రు ఒకేసారి తాత‌ల‌య్యారు. ఈ ఇరువురు మ‌న‌వ‌డ్ని ఎత్తుకొని తెగ సంతోషానికి గుర‌య్యారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు కుమారుడికి.. మ‌రో ఏపీ మంత్రి నారాయ‌ణ కుమార్తెకు రెండేళ్ల కింద‌ట పెళ్లి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు మంత్రులు వియ్యంకులు కావ‌టం అప్పుట్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా నారాయ‌ణ కుమార్తె మంగళ‌వారం ఒక పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చారు. హైద‌రాబాద్ లోని ఒక ఆసుప‌త్రిలో ఆమె డెలివ‌రీ జ‌రిగింది. మ‌న‌మ‌డ్ని చూసేందుకు వెళ్లిన ఇద్ద‌రు ఏపీ మంత్రులు.. చిన్నారిని ఎత్తుకొని మురిసిపోయారు. ఈ మ‌ధ్య‌నే కొడుకును పోగొట్టుకొని తీవ్ర వేద‌న‌లో ఉన్న మంత్రి నారాయ‌ణ‌కు మ‌న‌మ‌డి రాక కాసింత ఆనందాన్ని ఇచ్చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/