Begin typing your search above and press return to search.
జగన్.. పవన్ లకు గంటా సవాల్
By: Tupaki Desk | 26 Jan 2017 8:55 AM GMTజల్లికట్టుపై నిర్వహించిన ప్రజాఉద్యమ స్ఫూర్తిగా ఏపీలోని విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అడుగడుగునా అడ్డు తగలమే కాదు.. దీక్షలో పాల్గొనేందుకు రోడ్ల మీదకు రాకుండా చేసేందుకు ఎన్ని ప్రయత్నాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. ఆర్కే బీచ్ కు వెళ్లే ఉన్న అన్న దారుల్ని మూసేసిన పోలీసులు.. ఏపీ సర్కారుకోరుకున్నట్లుగా శాంతి ధర్నాను అడ్డుకోవటంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఏపీ అధికారపక్ష నేతలు ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఆంధ్రోళ్ల మనసుల్ని గాయపరుస్తుండటం గమనార్హం.
ఇప్పటికే కేంద్రమంత్రి.. టీడీపీ నేత సుజనా చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయగా.. ఆయన తరహాలోనే పలువురు టీడీపీ నేతలు దురుసు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీ రాష్ట్ర మంత్రి గంటాశ్రీనివాసరావు స్పందిస్తూ.. ప్రత్యేక ప్యాకేజీపై కలిగే లాభాల గురించి ఏపీవిపక్ష నేత జగన్ కానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లలో ఎవరైనా సరే బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు.
విజయవాడలో విలేకరులతో మాట్లాడిన గంటా.. జగన్.. పవన్ లు తమ అభిప్రాయాలు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడ ఆందోళనలు జరిగినా అడ్డుకుంటామని చెప్పిన గంటా.. గత ఏడాది విశాఖలో జరిగిన పారిశ్రామిక సదస్సు తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ఈ చర్చకు ఎవరైనా హాజరు కావొచ్చని చెప్పారు. రేపటి నుంచి విశాఖలో జరిగే పారిశ్రామిక సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. గంటా మాటల తీరు చూస్తే.. జగన్.. పవన్ లు ఇద్దరూ కలిసి ప్రత్యేక హోదా మీద ఏపీ సర్కారు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అడ్డుకోవటమే కాదు.. గంటా లాంటి నేతలకు తమదైన రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/