Begin typing your search above and press return to search.
గంటా రిక్వెస్ట్...ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోవద్దు
By: Tupaki Desk | 17 Feb 2019 12:56 PM GMTఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయాల్లో ఎత్తుగడ సెగ తగిలినట్లు స్పష్టమవుతోంది. పార్టీలు మారడంలో గతంలో గంటా శ్రీనివాసరావు తీరును గమనించిన పలువురు సోషల్ మీడియాలో ఆయనపై ప్రచారం జోరందుకుంది. గంటా త్వరలోనే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేస్తారని...వైసీపీ లేదా జనసేనలో ఆయన చేరనున్నారనే ప్రచారం సాగింది. గంటాకు సన్నిహితంగా ఉండే ఎంపీ అవంతి శ్రీనివాస్ పార్టీ మారడం ఇందుకు నిదర్శనమని పలువురు విశ్లేషిస్తూ..సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఇలా పెద్ద ఎత్తున సాగిన ప్రచారం నేపథ్యంలో తాజాగా గంటాశ్రీనివాసరావు స్పందించారు.
విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారనున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానే తప్ప పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉండాలా లేక ఎంపీగా వెళ్లాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. అసలు ఈసారి పోటీ చేయవద్దని చెప్పినా మానేస్తానన్నారు. బీసీ గర్జన నిర్వహించడానికి జగన్ అనర్హుడని అభిప్రాయపడ్డారు. 13 జిల్లాలో ఎక్కడా బీసీలను జిల్లా అధ్యక్షులుగా నియమించని జగన్..ఇప్పుడు బీసీల పేరుతో హడావిడి చేయడం హాస్యాస్పదమని అన్నారు.
కాగ, పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం నేపథ్యంలోనే పార్టీ మార్పు గురించి గంటా వివరించారని అంటున్నారు. ఓవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మరోవైపు వైసీపీ నేతలు సహా ఇతర రాజకీయ నేతలు సైతం గంటా పార్టీ మార్పుపై సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కామెంట్ల నేపథ్యంలోనే గంటా క్లారిటీ ఇచ్చారని అంటున్నారు.