Begin typing your search above and press return to search.

టీడీపీ కి రాంరాం? స్పందించిన గంటా శ్రీనివాసరావు!

By:  Tupaki Desk   |   5 Dec 2019 9:41 AM GMT
టీడీపీ కి రాంరాం? స్పందించిన గంటా శ్రీనివాసరావు!
X
గత కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీని వీడబోయే ఎమ్మెల్యేల జాబితాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తూ ఉంది. అందుకు పలు కారణాలున్నాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండటమే రాజకీయంగా పెట్టుకున్నారు గంటా శ్రీనివాసరావు. అందులోనూ తెలుగుదేశం పార్టీ ఓడిన తర్వాత ఏ విషయం గురించి కూడా ఆయన స్పందించడం లేదు.

అసెంబ్లీలో గంటా శ్రీనివాసరావు కామ్ గా కూర్చుని వచ్చారు. చంద్రబాబును ఇరకాటంలో పెడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు దుమ్మెత్తిపోసినా.. గంటా శ్రీనివాసరావు కామ్ గా ఉన్నారు కానీ, మారు మాట్లాడలేదు. ఇలాంటి నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అందులో భాగంగా ముందుగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేసినట్టుగా భోగట్టా. అయితే అక్కడ గంటాకు శత్రువులు చాలా మంది ఉన్నారు. ఆ పై గంటాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు అఆరోపణలు చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీ ఆయనను చేర్చుకునే అవకాశాలూ కనిపించలేదు.

దీంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే మాట వినిపించింది. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీలో అవకాశం దక్కేలా లేకపోవడంతో కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో అయినా గంటా ఉండాలని అనుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఈ విషయంలో ఇన్నాళ్లూ కామ్ గా ఉంటూ వచ్చారు ఈ మాజీ మంత్రి.

దీంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఆ విషయంపై ఎట్టకేలకూ స్పందించారు గంటా శ్రీనివాసరావు. తను తెలుగుదేశం పార్టీని వీడేది లేదంటూ ఆయన ఒక
ప్రకటన చేశారు. తను తెలుగుదేశం పార్టీలోనే ఉండబోతున్నట్టుగా.. త్వరలోనే నియోజకవర్గం సమీక్ష ను నిర్వహించనున్నట్టుగా.. పార్టీ ఓటమి కారణాలను అన్వేషించనున్నట్టుగా ఆయన ప్రకటించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇంతటితో గంటా తెలుగుదేశంలో కుదురుకున్నట్టేనా?