Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ను కెల‌కాల్సిన అవ‌స‌ర‌ముందా గంటా?

By:  Tupaki Desk   |   21 March 2019 11:27 AM GMT
ప‌వ‌న్ ను కెల‌కాల్సిన అవ‌స‌ర‌ముందా గంటా?
X
కొన్ని త‌ప్పులకు మూల్యం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విష‌యం సీనియ‌ర్ నేత‌ల‌కు తెలియంది కాదు. కానీ.. ఒత్తిడో.. మితిమీరిన ధీమానో వారి నోటి నుంచి అన‌వ‌స‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసేలా చేస్తుంది. తాజాగా ఏపీ మంత్రి గంటా కూడా ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి. విశాఖ జిల్లాలో గంటాకు తిరుగులేద‌న్న మాట వినిపిస్తూ ఉంటుంది. అయితే.. అందులో నిజం స‌గ‌మేన‌ని.. అంత సీన్ లేద‌న్న మాట‌ను చెప్పేటోళ్లు లేక‌పోలేదు.

ఇప్ప‌టికే సీటు మారిన వేళ‌.. గంటాకు ఏమైనా దెబ్బ ప‌డుతుందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. విశాఖ ఉత్త‌రం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీ‌నివాస‌రావు ఈ రోజు త‌న నామినేష‌న్ ను దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గెలుపు ధీమా వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థికి గెలుస్తామ‌న్న ఆత్మ‌విశ్వాసం ఉండ‌టం త‌ప్పు కాదు. కానీ.. అన‌వ‌స‌ర‌మైన ధీమా త‌ప్పు. కాన్ఫిడెన్స్ ఎంత అవ‌స‌ర‌మో.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ అంతే అన‌వ‌స‌రం. ఈ విష‌యాన్ని మ‌ర్చిపోయారో ఏమో కానీ.. గంటా వారు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు కొన్ని వ‌ర్గాల వారికి మంట ప‌ట్టేలా మారాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చి పోటీ చేసినా గెలుపు త‌న‌దేన‌ని వ్యాఖ్యానించారు.

బాబు 40 ఏళ్ల అనుభ‌వం రాష్ట్రానికి శ్రీ‌రామ‌ర‌క్ష.. గెలుపు ప‌క్కా.. మెజార్టీ ఎంత‌? అన్న‌దే అంద‌రూ మాట్లాడుకుంటున్న‌ది లాంటి బ‌డాయి మాట‌లు ఓకే. కానీ.. అవ‌స‌రం లేని వేళ‌.. అన‌వ‌స‌ర‌మైన ధీమాను ప్ర‌ద‌ర్శిస్తూ.. ప‌వ‌న్ ను త‌క్కువ చేసేలా మాట్లాడ‌టం వ‌ల్ల న‌ష్టం గంటాకేన‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల‌వేళ ఎంత అవ‌స‌ర‌మో అంతే మాట్లాడాలి. అంత‌కు మించి ఒక్క కామెంట్ ఎక్కువ చేసినా న‌ష్టం గ్యారెంటీ. గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శించ‌టం త‌ప్పు కాదు. కానీ.. ప‌వ‌న్ ను కెలికి మ‌రీ ఎట‌కారం ఆడాల్సిన అవ‌స‌రం ఏమిటి? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఓకే కానీ కెలుకుడు అవ‌స‌రం లేదు గంటా. ఈ విష‌యం కూడా చెప్పించుకుంటున్నావంటే.. లెక్క తేడా వ‌స్తున్న‌ట్లు చూసుకోండి గంటా సాబ్‌.