Begin typing your search above and press return to search.
పవన్ ఎదురున్నా గెలుపు మీద గంటా ధీమా?
By: Tupaki Desk | 9 May 2016 7:35 AM GMTఒక మీడియా అధినేత నిర్వహించే ప్రత్యేక ఇంటర్వ్యూకు హాజరైన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. చాలా అంశాలపై కూల్ గా.. ఓపెన్ గా మాట్లాడిన ఆయన గతం.. వర్తమానం.. భవిష్యత్తు రాజకీయాల్ని ప్రస్తావించారు. సదరు ఇంటర్వ్యూలో గంటా వెల్లడించిన ఆసక్తికర అంశాల్ని చూస్తే..
= పుట్టి పెరిగింది ప్రకాశం జిల్లాలో. ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు క్లాస్ మేట్. ఏయూలో లా చేయటం.. డెక్కన్ క్రానికల్ పీఆర్వోగా పని చేశా. ఫ్రెండ్ తో కలిసి షిప్పింగ్ కంపెనీ స్టార్ట్ చేశా. 1999లో వచ్చిన ఎలక్షన్లో తటస్తులకు టిక్కెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కింది. విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడితో మంచి సంబంధాలే ఉన్నా.. 1999 ఎన్నికల్లో చోడవరంలో మిలట్రీ రాయుడి అభ్యర్థిత్వాన్ని మార్చాలని కోరా. అది అయ్యన్నకు కోపం తెప్పించింది.
= కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే సమయానికి టీడీపీతో పోలిస్తే.. జగన్ పార్టీనే మొగ్గులో ఉంది.కానీ.. రాజకీయాల్లో వెసులుబాటు చాలా అవసరం. జగన్ దగ్గర అది ఉండదు. జగన్ వ్యవహారశైలి తెలుసు. అందుకే.. ఆయన కాదని చంద్రబాబు పార్టీలో చేరా.
= మోడీ సర్కారు ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పటం కొంత ఇబ్బందే. అయితే.. హార్డ్ వర్క్ తో ఈ సమస్యను అధిగమించొచ్చు. కేంద్రం సహకారం అందించినా.. లేకున్నా మనల్ని మనం నమ్ముకోవాలి. కేంద్రమంత్రులు స్పెషల్ స్టేటస్ లేదని చెప్పటం ఇబ్బందే.
= ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేసేలా మాట్లాడటం.. రెచ్చగొట్టేలా వ్యవహరించకూడదు. ఒకవేళ అలాంటిదే చేస్తే నష్టపోయేది బీజేపీనే.
= 2014 ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ 2019 నాటికి బీజేపీ వైపు వెళ్లినా గెలుపు మాత్రం టీడీపేదే. విపక్ష నేతగా జగన్ ఉంటే మా గెలుపు కేక్ వాకే.
= జగన్ లో అవగాహనారాహిత్యం.. అపరిపక్వత.. టీమ్ స్పిరిట్ లేవు. రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి పగలు అన్న తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో జగన్ లాంటి నేతలు సరిగ్గా వ్యవహరిస్తే ఎదిగేందుకు వీలు ఉంటుంది. కానీ.. ఇప్పటివరకూ అలాంటి జరగేదు. జగన్ కానీ ప్రతిపక్ష నేతగా కొనసాగితే 2019లో ఎన్నికల్లో గెలుపు మాదే.