Begin typing your search above and press return to search.

గంటా డిసైడ్ చేసుకున్నట్లేనా ?

By:  Tupaki Desk   |   15 April 2022 3:25 AM GMT
గంటా డిసైడ్ చేసుకున్నట్లేనా ?
X
మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసుకున్నట్లే కనిపిస్తోంది. మిగిలిన రెండేళ్ళను తెలుగుదేశంపార్టీలోనే కంటిన్యు అయిపోవాలని బహుశా గంటా నిర్ణయించుకున్నట్లున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇంతకాలం ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలీదు. అలాంటిది విశాఖపట్నంలోని టీడీపీ ఆఫీసుకు వెళ్ళటంతో పాటు వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేయటమే దీనికి నిదర్శనం.

మాజీమంత్రులు, ఎంఎల్ఏలు, కొందరు వైసీపీ నేతలు తొందరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పారు. అధికారపార్టీ వైసీపీని వదిలేసి ప్రతిపక్ష టీడీపీలోకి ఎందుకు చేరుతారనే విషయంలో మాత్రం వివరణ ఇవ్వలేదు. పార్టీని బలోపేతం చేయటానికి అగ్రనేతలు పాదయాత్ర చేయాలా ? లేకపోతే ప్రజాయాత్ర చేయాలా ? అనే విషయమై ఆలోచన జరుగుతున్నట్లు చెప్పారు. పాదయాత్రకు, ప్రజాయాత్రకు తేడా ఏమిటో గంటాకే తెలియాలి.

ఎనిమిది జిల్లాలకు మంత్రులు లేరన్న విషయాన్ని ఎత్తిచూపారు. అలాగే రాజధాని అనిచెబుతున్న విశాఖ జిల్లాకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిద్యం లేకపోవటం ఏమిటంటు నిలదీశారు.

మొత్తానికి గంటా తాజా వైఖరి వల్ల అర్ధమవుతున్నదేమంటే ఆయన టీడీపీలోనే కంటిన్యు అవబోతున్నారని. ఎందుకంటే ఇంతకాలం రాజకీయ ప్రకటనలకు, కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. తొందరలోనే వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం ఎప్పటినుండో జరుగుతోంది. అయితే ఆ ప్రయత్నాలేవీ సక్సెస్ కాలేదని సమాచారం.

అయితే ఇక గంటా వైసీపీలో చేరే అవకాశాలు లేవని ఫైనల్ అయిపోయిందట. అందుకనే టీడీపీ ఆఫీసులో కూర్చుని అధికారపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. గంటా ఆలోచన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో జనసేన+టీడీపీ పొత్తులు ఖాయమైనట్లే ఉంది.

ఎందుకంటే గంటా తొందరలోనే జనసేనలో చేరబోతున్నట్లు కూడా ప్రచారముంది. అయితే రెండుపార్టీల మధ్య పొత్తుంటే ఒకపద్దతి, పొత్తులేకపోతే మరోపద్దతని గంటా అనుకున్నారట. పొత్తుంటుందని ఖాయమైన తర్వాతే గంటా టీడీపీలోనే కంటిన్యు అవుదామని డిసైడ్ చేసుకున్నారట. అందుకనే హఠాత్తుగా టీడీపీ ఆఫీసులో కూర్చుని వైసీపీపై వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది.