Begin typing your search above and press return to search.
మళ్ళీ పొలిటికల్ జంక్షన్ లో గంటా...?
By: Tupaki Desk | 29 Dec 2022 3:51 AM GMTసీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్ళీ పొలిటికల్ జంక్షన్లోనే నిలుచున్నారు అని అంటున్నారు. ఆయన లేటెస్ట్ ఎత్తుగడ అయిన విశాఖలో కాపునాడు మీటింగ్ పెద్దగా సాగలేదు. తాను తెర వెనక ఉండి ఈ సదస్సుకు కీలక నేతలను అందరినీ నిర్వాహకుల చేత ఆహ్వానింపచేసినా ఎవరూ రాలేదు. ప్రముఖ కాపు నాయకులు, మంత్రులు హాజరైతే ఆ సభలో గంటా బాగా హైలెట్ అయి ఉండేవారు.
కానీ జరిగింది వేరు. గంటా అంటే దూరంగా ఉంటున్నారు కాపు నాయకులు అని చాలా కాలంగా విమర్శలు వినిపించాయి. ఇపుడు వాటిని నిజం చేసేలా అయనా నాయకత్వంలో కాపునాడు అంటూ ప్రచారం సాగడంతో మొదటికే డుమ్మా కొట్టేశారు అని అంటున్నారు. ఇక చూస్తే విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పక్కా లోకల్. పైగా ఆయన తూర్పు కాపులకు నాయకుడిగా ఉన్నారు. శ్రీకాకుళంతో మొదలుపెట్టి గోదావరి జిల్లాల దాకా బొత్స హవా ఒక స్థాయిలో ఉంటుంది.
ఆయన తానుగా కాపులకు ప్రతినిధిగా ఉండాలనుకుంటునారు. అలాగే విశాఖకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ తన తాత తండ్రిల వారసత్వాన్ని కొనసాగిస్తున్నరు. ఆయన తాత గుడివాడ అప్పన్న ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం ఎమ్మెల్యే అయ్యారు. తండ్రి గుడివాడ గురునాధరావు మినిస్టర్ గా ఎంపీగా చేశారు. ఇపుడు అమరనాధ్ కూడా తాము పక్కా లోకల్ అని చెబుతున్నారు.
మరో వైపు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గంటాతో విభేదించే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఇలా వైసీపీలో ఉన్న నాయకులు అంతా కూడా కాపునాడు మీటింగ్ కి రాకపోవడానికి గంటా క్రీనీడలో ఆ సమావేశం జరుగుతోందని ఆలోచించబట్టే అంటున్నారు. అలా వైసీపీ అధినాయకత్వం కూడా గంటా అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని భావించి తమ పార్టీ వారిని వెళ్లకుండా ఆదేశాలు ఇచ్చింది అని అంటున్నారు. పోనీ తెలుగుదేశం నుంచి అయినా నాయకులు రావాలి కదా అంటే గంటా టీడీపీతో అంటీముట్టనట్లుగా వ్యవహరించడం వల్ల ఆయనతో అంటకాగితే తాము కూడా ఇబ్బందులలో పడతామని భావించి వారు రాలేదని అంటున్నారు.
ఇక గంటా జనసేనలో చేరుతారు అని ప్రచారంలో ఉంది. ఆ పార్టీకి చెందిన నాయకులు కొందరు వచ్చిన విశాఖలో కీలకంగా ఉన్న కాపు నాయకులు అయితే కనిపించలేదు. దాంతో కాపునాడు సభ పేరిట విశాఖ నుంచి అతి పెద్ద రాజకీయ సంచలనానికి తెర తీద్దామని భావించిన గంటా ప్లాన్ వర్కౌట్ కాలేదని అంటున్నారు. కాపునాడు సభ హిట్ అయి ఉంటే అందరూ వచ్చి ఉంటే గంటా ఉత్తరంధ్రా జిల్లాలలో కాపులకు నాయకుడిగా మారి చక్రం తిప్పేవారని, ఫలితంగా ఆయన చుట్టూ అన్ని పార్టీల రాజకీయం తిరిగేదని అంటున్నారు.
ఇపుడు అవన్నీ తేలిపోవడంతో గంటా మరోమారు పొలిటికల్ గా జంక్షన్లోనే ఉన్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఎక్కడ నుంచి చేస్తారు అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది. తెలుగుదేశంలో టికెట్ ఇచ్చినా ఆయన కోరుకున్న చోట దక్కుతుందా లేక తెలుగుదేశం పార్టీ ఆయన్ని విశాఖ ఎంపీ గా పోటీ చేయమంటే ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది కూడా చర్చకు వస్తోంది. మొత్తానికి 2022లో గంటా కాపునాడు అంటూ కాపు నేతలతో భేటీలు వేసి ఏపీలో రాజకీయ సంచలనాలకు తెర తీయాలనుకున్న కలసిరాలేదు అంటున్నారు. మరి 2023లో ఆయన ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.