Begin typing your search above and press return to search.
గంటా ఫ్యూచర్ ప్లాన్ రెఢీ !
By: Tupaki Desk | 24 Jun 2018 5:36 AM GMTఏపీలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. అధికార పక్షంపై వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీ నుంచి కూడా వలసలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కొత్త పార్టీ రావడంతో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా పార్టీ వలసలు పెరుగుతాయి.
గంటా శ్రీనివాసరావు... ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేత. రాష్ట్ర మంత్రి. కానీ చాలా చిత్రంగా మొన్న కేబినెట్ మీటింగ్ కు ఆయన గైర్హాజరు అయ్యారు. అప్పటికే గంటాకు బాబుతో చెడింది అనే వార్తలు వచ్చాయి గాని మీటింగ్ కూడా ఎగ్గొట్టడంతో అనుమానాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఇప్పటికే టీడీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డిని కలిశారు. అది కూడా ఆనం సొంతూరుకి వెళ్లి మరీ కలవడం అనేక సందేహాలకు తావిస్తోంది.
అయితే గంటా గత చరిత్రను పరిశీలించినపుడు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. పీఆర్పీ నుంచి కాంగ్రెస్ లోకి - ఆ తర్వాత తెలుగుదేశంలోకి పార్టీ మారి వరుసగా గెలుస్తున్న గంటా శ్రీనివాసరావు ఎప్పటిలాగే ఈ సారి కూడా జంపింగ్ కు సిద్ధం అయిపోయారట. అయితే, గంటా ఏ పార్టీలో ఉన్నా కూడా చిరంజీవి కుటుంబంతో సంబంధాలు పోగొట్టుకోలేదు. గతంలో ఓసారి రెవెన్యూ శాఖను చూసే కేఈ కృష్ణమూర్తి ఒక అధికారిని వైజాగ్ లో బదిలీ చేస్తే పవన్ కళ్యాణ్ చేత చంద్రబాబుకు చెప్పించుకుని ఆ బదిలీని ఆపారట గంటా. పవన్‌తో గంటాకు అంత మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో సామాజికవర్గ పరంగా బలంగా ఉన్న గంటా, తనకు దగ్గరయిన కుటుంబ పార్టీ అయిన జనసేనలో చేరితే బాగుంటుందని భావిస్తున్నారట.
ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా ఉండటంతో టీడీపీని వదిలేయడమే మంచిదని గంటా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనసేనలో చేరి కనీసం 10-15 సీట్లలో గెలుపు గుర్రాలను తేవడంతో పాటు పార్టీలో కీలక బాధ్యతలను గంటా నిర్వహిస్తారని వార్తలు వస్తున్నాయి. యువకులు, కొత్త రక్తం అని ఎన్ని కబుర్లు చెప్పినా జంపింగ్‌లో లేకుండా జనసేన కూడా నిలబడే అవకాశమే లేదన్నమాట. ఇంకో విషయం ఏంటంటే... నాదెండ్ల మనోహర్ పవన్ భేటి వెనుక కూడా గంటా శ్రీనివాసరావు ఉన్నట్లు చెబుతున్నారు.