Begin typing your search above and press return to search.
బీజేపీ విష్ణుకుమార్ రాజుకు గంటా బ్రేకులు....?
By: Tupaki Desk | 16 May 2023 7:00 AM GMTఇటీవల బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఒక టీడీపీ అనుకూల మీడియా చానల్ ఇంటర్వ్యూకి వెళ్లారు. అక్కడ ఆయన తెగ ఉత్సాహంగా మాట్లాడారు, కొన్ని కీలకమైన విషయాల్లో చెప్పాల్సింది చెప్పారు. ఫలితంగా బీజేపీ నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్నారు. అలా బీజేపీ రాజు గారికి గట్టి దెబ్బ తగిలింది.
ఆయన తెలూదేశంలోకి వెళ్లాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని చూస్తున్నారు. కానీ ఆయనకు అన్నీ వ్యతిరేక పరిస్థితులే కనిపిస్తున్నాయని అంటున్నారు. తెలుగుదేశంలో ఆయన చేరేందుకు డోర్స్ ఓపెన్ అయినా టికెట్ ఇచ్చే సీన్ లేదని తాజా టాక్. దానికి కారణం ఆయన సొంత నియోజకవర్గం విశాఖ ఉత్తరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఉన్నారు.
ఆయన వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీకి రెడీగా ఉన్నారు. ఆయన్ని ఆ సీటు నుంచి కదపడం ఎవరి తరమూ కాదు, ఆయన నో అంటేనే తప్ప టీడీపీ అధినేత చంద్ర్ బాబు కూడా ఏమీ చేయలేరు. దాంతో విష్ణు కుమ్మార్ కి గంటా చక్రం సీటు విషయంలో అడ్డుపడుతోంది అని అంటున్నారు.
ఆయన బీజేపీ మీద చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. అదే టైం లో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చేసింది దంతో ఈసారి టికెట్ పార్టీ ఇవ్వదని టాక్. ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన ఓడిపోవడం ఖాయమే. 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ రాజు పోటీ చెస్తే 18,790 ఓట్లు వచ్చాయి.అంటే ఇది మొత్తం పోలైన ఓట్లలో కేవలం 10.63 శతం మాత్రమే అని చెప్పాలి.
అలా పార్టీ అండ లేకుండా ఆయన అసలు గెలవలేరు. పొత్తులు కూడా ఉండాల్సిందే. ఇక బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకున్నా కూడా ఈ సీటు ఇవ్వరనే టాక్ ఉంది. పోనీ రాజు గారు జనసేన వైపు వెళ్లి పొత్తులో భాగంగా ఈ సీటుని అడగాలని అనుకున్నా గంటాకు జనసేనతో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు. దాంతో వారు ఈ సీటు జోలికి రారు అని అంటున్నారు.
మరి రాజు గారు ఏమి చేయాలి అంటే గమ్మున బీజేపీలో ఉండాలి. లేకపోతే తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైనా నామినేట్ పోస్ట్ ని తీసుకోవాలి. ఇక 2024 ఎన్నికల్లో గంటాకు మద్దతుగా ప్రచారం కూడా చేయాలి. అంటే తాను పోటీ చేయాల్సిన సీటుని వదులుకోకతప్పదని అంటున్నారు. ఆ విధంగా బీజేపీ రాజు అతి ఉత్సాహానికి గంటా చెక్ పెట్టేఅశారు
మొత్తానికి ఆ చానల్ ఇంటర్వూలో రాజు గారూ మీకు రాజకీయలు సరిపడవని అన్న మాటలే ఇపుడు నిజం కానున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా రాజు గారి రాజకీయం గందరగోళంలో పడింది అని అంటున్నారు.