Begin typing your search above and press return to search.

ఆ స‌ర్వేపై మండిప‌డుతోన్న గంటా!

By:  Tupaki Desk   |   20 Jun 2018 10:20 AM GMT
ఆ స‌ర్వేపై మండిప‌డుతోన్న గంటా!
X
టీడీపీలో కొద్ది రోజులుగా నివురుగ‌ప్పిన నిప్పులా ఉన్న‌ అంత‌ర్గ‌త విభేదాలు ఒక్క‌సారిగా బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. గ‌తంలో భూవివాదంలో మంత్రి గంటా శ్రీనివాసరావుపై అయ్య‌న్న పాత్రుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం తెలిసిందే. ఎంపీ అవంతి శ్రీనివాస్ తో గంటా గొడవ ప‌డ‌డం..వంటి వ్య‌వ‌హారాల‌లో కూడా గంటాకు మ‌ద్ద‌తుగా టీడీపీ అధినేత - సీఎం చంద్ర‌బాబు రాలేదు. దీంతో - గంటాకు చంద్ర‌బాబు పొమ్మ‌న లేక పొగ‌బెడుతున్నార‌ని టాక్ వ‌స్తోంది. దానికితోడు చంద్ర‌బాబు అనుకూల మీడియా నిర్వ‌హించిన తాజా స‌ర్వేలో గంటా ప‌నితీరు బాలేద‌ని - భీమిలిలో ఆయ‌న ఓడిపోతార‌ని వెల్ల‌డైంది. పై వ్య‌వ‌హారాల‌లో త‌న‌కు చంద్ర‌బాబు మ‌ద్ద‌తుగా లేర‌ని గంటా గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అమ‌రావ‌తిలో జ‌రిగిన కేబినెట్ స‌మావేశానికి గంటా గైర్హాజ‌రై త‌న నిర‌స‌న తెలిపారు. పైకి అనారోగ్యం సాకుగా చూపుతున్నప్ప‌టికీ...గంటా విశాఖ‌లోని త‌న స్వ‌గృహంలో స‌న్నిహితుల‌తో స‌మావేశం నిర్వ‌హించార‌ని తెలుస్తోంది. అంతే కాకుండా, త‌న‌ను సంప్ర‌దించాల‌నుకున్న టీడీపీ నేత‌ల‌కు గంటా అందుబాటులోకి రాలేద‌ని తెలుస్తోంది.

చంద్ర‌బాబు - గంటాల మ‌ధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. త‌న‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేందుకు టీడీపీ అధిష్టానం చూస్తోంద‌ని గంటా భావిస్తున్నారు. భూకుంభకోణంలో తనపై దాఖలైన పిల్‌ వెనుక టీడీపీ నేతల‌ పాత్ర ఉందని గంటా చంద్ర‌బాబుకు చెప్పినా గ‌తంలో స్పందించ‌లేదు. ఆ త‌ర్వాత అవంతి శ్రీనివాస్ తో గొడవ....తాజా స‌ర్వేలో త‌న‌కు వ్య‌తిరేకంగా రిపోర్టు రావ‌డంతో గంటా ...చంద్ర‌బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది.త‌న‌కు వ్యతిరేకంగా టీడీపీ ప్రచారం చేయింస్తోందని గంటా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. భీమిలి మిన‌హా టీడీపీ గెలుస్తుందని భావిస్తోన్న‌13 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంద‌ని గంటా భావిస్తున్నార‌ట‌. తన‌కు భీమిలిలో ప‌ట్టు ఉంద‌ని - ఆ సర్వే అంతా బోగస్‌ అని గంటా తన సన్నిహితుల వద్ద అన్నార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు విశాఖ పర్యటనకు గంటా డుమ్మా కొట్టాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. నేడు మరోసారి స‌న్నిహితుల‌తో సమావేశం నిర్వ‌హించి కీలక నిర్ణయం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది.