Begin typing your search above and press return to search.
ఆ మంత్రి కొడుకు పోస్టర్ చిరిగింది
By: Tupaki Desk | 30 Jun 2017 7:06 AM GMTవిశాఖ జిల్లాలో మంత్రులు అయ్యన్నపాత్రుడు - గంటా శ్రీనివాసరావుల మధ్య వివాదం సద్దుమణిగినట్లే కనిపిస్తున్నా లోలోన మాత్రం రగులుతూనే ఉంది. తాజా ఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి. మంత్రి గంటా తనయుడు గంటా రవితేజ హీరోగా నటించిన జయదేవ్ సినిమా పోస్టర్లను అయ్యన్నపాత్రుడి అనుచరులు పీకిపడేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వివాదం మళ్లీ మొదలైంది.
అయ్యన్నపాత్రుడి నియోజకవర్గమైన నర్సీపట్నంలో 'జయదేవ్' సినిమా పోస్టర్లు చించేసి, కటౌట్లు ధ్వంసం చేశారంటూ గంటా రవితేజ అభిమానులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇది రాష్ర్టవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెద్ద హీరోల సినిమాల విషయంలో అభిమానుల మధ్య ఇలాంటివి జరుగుతుంటాయి కానీ పూర్తిగా కొత్త హీరో సినిమా పోస్టర్లు చించడం అన్నది ఇంతవరకు ఎక్కడా లేదు. అయితే.. రాజకీయ నేపథ్యమున్న హీరో కావడంతో అవి దీనిపై ప్రభావం చూపాయని అంటున్నారు.
మంత్రి తనయుడు కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ జిల్లాలో ఎక్కువ థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నర్సీపట్నంలో పోస్టర్ల చింపివేయడం వివాదాన్ని రేపింది. తమ హీరో పోస్టర్లు చించేసి, కటౌట్లు ధ్వంసం చేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని రవితేజ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే... సినిమాకు హైప్ క్రియేట్ చేయడం కోసం గంటా అనుచరులే ఈ పని చేశారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/