Begin typing your search above and press return to search.

వైసీపీలో చేరికపై గంటా..అడ్డు చెప్పేవారే లేరట!

By:  Tupaki Desk   |   1 Sep 2019 4:26 PM GMT
వైసీపీలో చేరికపై గంటా..అడ్డు చెప్పేవారే లేరట!
X
గంటా శ్రీనివాసరావు... బిజినెస్ లో టైకూన్ గా ఎదిగిన ఈ నేత రాజకీయాల్లో కూడా అదే స్పీడుతో దూసుకెళుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఓటమి అన్నదే ఎరుగకుండా విజయపథాన దూసుకువస్తున్న గంటా... పదవులను దక్కించుకోవడంలో తనను మించిన వారు లేరని నిరూపించారు. పార్టీ ఏదైనా, పోస్టు ఏదైనా... గంటా అనుకుంటే... అది ఆయన కాళ్ల వద్దకు చేరాల్సిందే. అలాంటి గంటా ఇప్పుడు ఎటూ కాకుండా పోతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటే... పదవులకు కోసం పార్టీలు మారే విషయంలో అందరికంటే ముందుండే గంటా... ఇప్పుడు వైసీపీలోకి చేరిపోతారన్న వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఈ వాదనల్లో ఏ మేర వాస్తవముందో తెలియదు గానీ... వైసీపీలోకి గంటా చేరికపై పెద్ద చర్చే నడుస్తోంది. అయితే నిన్నటిదాకా ఈ ప్రచారాన్ని అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించని గంటా.,.. ఇప్పుడు నోరు విప్పేశారు. తాను అనుకుంటే... వైసీపీలోకి చేరిక విషయంలో తనను అడ్డుకునే వారెవరంటూ సంచలనాలకే సంచలన కామెంట్ చేశారు. నిజమే మరి... గంటా పొలిటికల్ కెరీర్ ను ఓ సారి పరిశీలించే వారు ఎవరైనా కూడా ఈ మాట నిజమేనని ఒప్పుకుంటారు. అయినా ఈ మాట గంటా నోట నుంచి ఎందుకు వచ్చిందన్న విషయానికి వస్తే... గంటా శిష్యుడిగా పేరుపడ్డ మంత్రి అవంతి శ్రీనివాస్... ఇప్పుడు విశాఖ జిల్లాలో వైసీపీకి సంబంధించి కీలక నేతగానే ఉన్నారు.

తన ద్వారా రాజకీయ పాఠాలు నేర్చుకున్న అవంతి.,,.. తనను కాదని సరిగ్గా ఎన్నికలకు ముందుగా వైసీపీలో చేరిపోయి - ఎమ్మెల్యేగా గెలిచి ఏకంగా జగన్ కేబినెట్ లో మంత్రి కూడా అయిపోయారు. మరి శిష్యుడు చేరిపోయిన పార్టీలో గురువు చేరతారా? తప్పేం లేదు గానీ... అవంతి వర్గం నుంచి గంటాకు సంబంధించి ఓ మాట బాగానే వినిపిస్తోంది. గంటా తనకు తానుగా వైసీపీలోకి వచ్చినా...ఆయనను స్వాగతించడానికి తామేమీ సిద్ధంగా లేమన్నది అవంతి వర్గం మాట. ఈ మాట తెలిసిందో, లేదంటే... జగన్ తో నిజంగానే టచ్ లో ఉన్నారో తెలియదు గానీ... తాను గనుక వైసీపీలో చేరాలనుకుంటే... తనను అడ్డుకునే వారే లేరంటూ గంటా సంచలన కామెంట్ చేశారు. మరి ఈ కామెంట్ పై గంటా శిష్యుడి వర్గం ఏమంటుందో చూడాలి.