Begin typing your search above and press return to search.
గవర్నమెంటు భూమి తాకట్టుపెట్టిన గంటా తోడల్లుడు
By: Tupaki Desk | 31 Dec 2016 9:25 AM GMTఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగిచెల్లించని సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పటికే గంటా గుట్టు బయటపడింది. తాజాగా మరో ఆశ్చర్యకరమైన సంగతి బయటపడింది. గంటా కుటుంబీకులు ఇండియన్ బ్యాంకులో రుణం తీసుకునేందుకు తాకట్టుపెట్టిన భూమి కూడా సొంత ఆస్తి కాదట.. ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారట.
ప్రత్యూష కంపెనీ పేరుతో రూ. 141 కోట్ల రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీలో డైరెక్టర్ గా గంటా శ్రీనివాస్ తోడల్లుడు పరుచూరి వెంకటభాస్కరరావు కూడా ఉన్నారు. వీరంతా రుణం కోసం తప్పుడు ఆస్తులను తాకట్టు పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ నివేదికను కోరారు. ప్రస్తుతం టీడీపీ భీమునిపట్నం ఇన్ చార్జ్ గా కూడా ఉన్న పరుచూరి వెంకటభాస్కరరావు… ఆనందపురం మండలంలో తన భూములంతా బ్యాంకు వద్ద తాకట్టు పెట్టారు. అయితే అవన్నీ ప్రభుత్వ భూములని వెబ్ ల్యాండ్ బయటపెట్టింది.
ఆనందపురం మండలం వేములవలస గ్రామంలోని సర్వే నంబర్ 122/9లో 0.23 ఎకరాలు - 122/11లో 726 గజాలు, 122/9 - 10 - 11 - 12 - 13 - 14 - 15ల్లో కొంత భూమిని పరుచూరి వెంకటభాస్కరరావు ఇండియన్ బ్యాంక్ లో తనఖా పెట్టారు. ఈ విషయం బ్యాంక్ ప్రకటించింది. అయితే సర్వే నంబర్లు 122/9 - 10 - 11 - 12ల్లో ఉన్నది ప్రభుత్వ భూమిగా వెబ్ సైట్ లో నమోదై వుంది. అంటే ప్రభుత్వ భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో నివేదిక ఇవ్వాల్సిందిగా స్థానిక తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. తోడల్లుడి పేరుతో తతంగమంతా నడిపింది గంటాయేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/