Begin typing your search above and press return to search.

గంటాకు ఎంత ధైర్యం.. జగన్ కే లేఖ రాశాడు?

By:  Tupaki Desk   |   6 Sep 2019 7:42 AM GMT
గంటాకు ఎంత ధైర్యం.. జగన్ కే లేఖ రాశాడు?
X
విశాఖ భూకుంభకోణం.. 2019కు ముందు చంద్రబాబు హయాంలో వివాదాస్పదమైన భూముల వ్యవహారం.. ఎవరిని అడిగినా దీనిపై ఇట్టే చెబుతారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ కుంభకోణంలో నాటి టీడీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు హస్తం ఉందని ఆరోపించింది. ఇక టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సహా చాలా టీడీపీ నేతలు కూడా విశాఖ భూకుంభకోణంలో గంటాకు లింక్ ఉందని విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.

అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం వచ్చింది. విశాఖ భూకుంభకోణంపై పోరాడిన వైసీపీ ఇప్పుడు దీనిపై సీరియస్ గా దృష్టిసారిస్తుందని అంతా భావించారు. కానీ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. వైసీపీ సైలెన్స్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావు తాజాగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాయడం విశేషం.

విశాఖ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ కు లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నాడు తాను కోరినా విచారణ జరుపలేదని.. మీరైనా విచారణ జరిపి నిజాన్ని నిగ్గుతేల్చాలని గంటా లేఖలో కోరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

దీంతో తనపై ఆరోపణలకు ఈ విచారణతో పుల్ స్టాప్ పడుతుందనే ధీమాతోనే గంటా లేఖ రాశారా? లేక వైసీపీలోకి వెళ్లాలని ఆలోచనతోనే ఇలా చేశాడా.? కుంభకోణంలో గంటా పాత్ర లేదా.? అసలు గంటా లేఖ వెనుక ఆత్యంర్యం ఏంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాలను తొలుస్తున్న ప్రశ్నలు.