Begin typing your search above and press return to search.

గంటాతో అవంతి బిగ్ ఫైటింగ్ ?

By:  Tupaki Desk   |   28 April 2022 5:30 PM GMT
గంటాతో అవంతి బిగ్ ఫైటింగ్ ?
X
విశాఖ జిల్లాలో టీడీపీ ఈ రొజుకీ  బలంగా ఉంది. ఇక రాజకీయ వ్యూహ చతురుడు, చురుకైన నేత గంటా శ్రీనివాసరావు విశాఖలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇంతకాలం గంటా సైలెంట్ గా ఉన్నారు. ఆయన టీడీపీని వీడిపోతారు అని ఒక దశలో వినిపించింది. కానీ తాను సైకిల్ దిగేది లేదు అని గంటా పక్కా క్లారిటీగా ఇపుడు చెప్పేస్తున్నారు.

లేటెస్ట్ గా ఆయన హైదరాబాద్ లో  ఒక వివాహ వేడుకల సందర్భంగా చంద్రబాబుని కలసి చాలా సేపు ముచ్చటించారు. ఇక బాబు సైతం విశాఖ సహా ఉత్తరాంధ్రా బాధ్యతలను గంటా మీద పెట్టినట్లుగా చెబుతున్నారు. ఆయనకు అర్ధ బలం, అంగబలం ఉంది.  దాంతో  గంటా వచ్చే ఎన్నికల్లో టీడీపీ సైకిల్ ని ఉత్తరాంధ్రాలో పరుగులు తీయించడానికి తనదైన రాజకీయ వ్యూహాలు అమలు చేయడం ఖాయం.

ఇక విశాఖ వైసీపీకి అధ్యక్షుడిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన గంటాకు ఒకనాటి సహచరుడే. మరో వైపు చూస్తే వైసీపీ వచ్చిన కొత్తల్లో టీడీపీ  మాజీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, ఎస్ ఎ రహమాన్, తిప్పల గురుమూర్తిరెడ్డి వంటి వారు వైసీపీలో చేరారు. అలాగే చాలా మంది కీలక నేతలు పార్టీని వీడిపోయారు.

ఇపుడు వారంతా తమకు అక్కడ సరైన ప్రాధాన్యత లేకపోవడంతో ఆలోచిస్తున్నారు అంటున్నారు. మరి వారంతా కూడా అవంతి కి కూడా సన్నిహితులే. ఇపుడు వైసీపీ ప్రెసిడెంట్ గా అవంతి వారి సహకారాన్ని తీసుకోవాలి. వారిని కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. అయితే గంటా అవతల వైపు ఉన్నారు. ఆయన రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడమే  బహు కష్టం.

ఇక ఈ రోజు వైసీపీలో ఉన్న కీలక నేతలతో పాటు చాలా మందికి కూడా టీడీపీ వైపు లాగేయగల సామర్ధ్యం గంటాకు ఉంది. దాంతో అవంతి ఒకనాటి తన సహచరునితోనే సమరం సాగించాల్సి వస్తుంది. అదే విధంగా ఆయన కూడా రాజకీయంగా పదును తేరాలి. మంత్రిగా తాను అనుకున్న విధంగానే పనిచేసిన అవంతికి ఇది బిగ్ టాస్క్. పార్టీలో అందరినీ ఆదరిస్తూ సాగాలి. అలాగే నేతలకు ఎలాంటి అసంతృప్తులకు తావు లేకుండా చూసుకోవాలి. గంటా వ్యూహాలకు చెక్ చెప్పాలి. అది సాధ్యమయ్యే పనేనా అంటే చూడాలి మరి. గంటా అవంతి ల మధ్య పోరు అయితే రానున్న రోజుల్లో విశాఖ జిల్లా  రాజకీయాల్లో రంజుగా సాగే అవకాశం ఉంది.