Begin typing your search above and press return to search.
గంటా సార్ ఎక్కడ...?
By: Tupaki Desk | 4 May 2022 4:30 PM GMTఅదేంటో చంద్రబాబు ఎపుడు విశాఖ వచ్చినా వెంటనే మరో నాయకుడి గురించి అంతా వెతుకుతారు. టీవీ కెమేరాలు కూడా ఆ పిక్ కోసం చూస్తాయి. ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆయన రెండేళ్ళ క్రితం చంద్రబాబు అమరావతే మన రాజధాని అంటూ జిల్లాల టూర్లు చేస్తూ విశాఖ వచ్చారు. అయితే ఆయన్ని విశాఖ పోలీసులు ఎయిర్ పోర్టులోనే ఆపేసి వెనక్కి పంపించేశారు. నాడు అతి పెద్ద రాజకీయ రచ్చ జరిగింది.
అపుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు అని మరో రచ్చ కూడా టీడీపీలో సాగింది. ఇక సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇపుడు చంద్రబాబు విశాఖ వచ్చారు. ఎయిర్ పోర్టు లో చంద్రబాబుకు మంచి స్వాగతం లభించింది. విశాఖ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచే గెలిచారు. అయితే వారిలో సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతుదారుగా మారిపోయారు. సో ఆయన రాలేదు అంటే ఓకే.
ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలలో తూర్పు నుంచి వెలగపూడి రామక్రిష్ణబాబు, పశ్చిన ఎమ్మెల్యే గణబాబు ఎయిర్ పోర్టుకు వచ్చి బాబుకు ఘన స్వాగతం పలికారు. మరి ఉత్తరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక బాబు ఈ టూర్ లో శ్రీకాకుళం నేరుగా వెళ్ళారు. మరి ఆయన విశాఖలో కూడా ఒక రోజు రాత్రి బస చేస్తారు. విశాఖలో సైతం బాదుడే బాదుడులో ప్రోగ్రాం లో పాలుపంచుకుంటారు కాబట్టి గంటా ఆ టూర్ లో పాల్గొంటారేమో చూడాలి.
ఏది ఏమైనా ఈ మధ్య ఫుల్ యాక్టివ్ అయి టీడీపీదే వచ్చే ఎన్నికల్లో అధికారం అని బల్ల గుద్ది మరీ చెబుతున్న గంటా శ్రీనివాసరావు బాబు రాక రాక విశాఖ వస్తే ఎయిర్ పోర్టు లో కనిపించకపోవడం మాత్రం ఒక చర్చగా ఉంది.