Begin typing your search above and press return to search.

ఉత్త‌రాంధ్ర శీను : బొత్స‌కు గంటా కౌంట‌ర్ ... ఏనాడ‌యినా అనుకున్నామా !

By:  Tupaki Desk   |   5 Jun 2022 8:17 AM GMT
ఉత్త‌రాంధ్ర శీను : బొత్స‌కు గంటా కౌంట‌ర్ ... ఏనాడ‌యినా అనుకున్నామా !
X
విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌కు టీడీపీ లీడ‌ర్ మ‌రియు మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ఇవాళ కౌంట‌ర్ ఇచ్చారు. ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల విడుద‌ల్లో నిన్న‌టి వేళ నెల‌కొన్న గంద‌ర‌గోళ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలో ఆయ‌న స్పందించి, త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు. దీంతో ఇప్పుడీ టాపిక్ చ‌ర్చ‌కు రానుంది. మ‌రింత తీవ్ర స్థాయిలో చ‌ర్చ‌కు పోనుంది. ఎందుకంటే ఎప్పుడూ ఎక్క‌డా బొత్స‌ను పెద్ద‌గా కౌంట‌ర్ చేయ‌ను అని భావించే గంటా స‌డెన్ గా గేరు మార్చ‌డం, పార్టీ సూత్రాల‌కు అనుసారంగా మాట్లాడ‌డం ఒకింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మే ! నిన్న‌మొన్న‌టి వేళ ఒంగోలు కేంద్రంగా జ‌రిగిన మ‌హానాడులో మెరిసిన గంటా శ్రీ‌ను పార్టీలో ఉన్నారో లేదో అన్న సందేహాల‌కు తెర దించారు. తాజాగా త‌న‌కు స్నేహితుడు అయిన విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్యనారాయణ‌ను టార్గెట్ చేస్తూ సోష‌ల్ మీడియాలో 4 మాట‌లు రాశారు. ఎందుక‌ని ?

వాస్తవానికి చాలా రోజుల నుంచి విశాఖ రాజ‌కీయాలలో గంటా శ్రీ‌ను యాక్టివ్ గా లేరు. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గంలోనూ పెద్ద‌గా తిరుగాడ‌డం లేదు అన్న వాద‌న ఉంది. టీడీపీ అధినాయ‌క‌త్వం పిలుపు ఇచ్చిన మేర‌కు బాదుడే..బాదుడు అనే కార్య‌క్ర‌మంలో కూడా పాల్గొన లేదు. ఏ విధంగా చూసినా ఆయ‌న పార్టీ కార్య‌క‌లాపాల్లో భాగం కావ‌డం లేదు.

"పదో తరగతి పరీక్షల ఫలితాలను ప్రకటించడంలోనూ ఆలస్యం..అయోమయం..ఎందుకింత గందరగోళం..నిర్ణీత సమయానికి ఫలితాలు ప్రకటిస్తామని వాయిదా వేయడం అంటే చేతకానితనమే ! అధికారులు ఎందుకు ఇంత అచేతనంగా మారుతున్నారు ? మొన్నటివరకు రోజూ పేపర్ లీక్ వార్తలు, ఇప్పుడేమో ఫలితాలు ప్రకటించలేని నిస్సహాయత...ఇంతకీ ఫలితాల వాయిదాకు కారణం ఏంటి ? అసమర్థ‌తనా ? ఇంకేమైనా ! లోపాయికారీ వ్యవహారాలా ? విడుదల రోజే లోపం ఎక్కడ ? బాధ్యత ఎవరిది?

గ్రేడ్లు తీసి మార్కులు ప్రకటిస్తామని చెప్పారు. ఓకే..! ప్రభుత్వ విధానం అనుకుందాం. అందులో తప్పొప్పుల ప్రస్తావన పక్కన పెడదాం. కనీసం ప్రభుత్వ ప్రతిష్టకు సంబందించిన ఇలాంటి పరీక్షా ఫలితాల విడుదలనూ సకాలంలో చేయలేకపోతే ఇక మీపై భరోసా ఎలా ఉంటుంది ? కనీసం మీకు మీరు సమర్థించుకో గలరా? గతంలో పరీక్షల నిర్వహణ తో పాటు ఫలితాల తేదీని కూడా అకడమిక్ క్యాలెండర్ లోనే పొందుపరిచే వాళ్ళం ? కచ్చితంగా అమలుచేసే వాళ్ళం. ఇప్పుడెందుకు అలా చేయలేకపోతున్నారు ? వివరించగలరా !" అని ప్ర‌శ్నించారాయ‌న‌.