Begin typing your search above and press return to search.
ప్లాన్ బీ ఉందా : గంటా డెసిషన్ మీద ఉత్కంఠ...?
By: Tupaki Desk | 5 Jun 2022 3:30 PM GMTవిశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంకా డైలామాలోనే ఉన్నారా అంటే ప్రచారం చూస్తే అలాగే ఉంది. ఆయన టీడీపీతో మళ్ళీ చురుకుగా ఉండాలని ఎంత చూస్తున్నా పార్టీ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన అయితే రావడం లేదు అంటున్నారు. దానికి తోడు అదే పార్టీలో ఆయన రాజకీయ ప్రత్యర్ధులు గంటా దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య ప్లాన్ బీని అమలు చేస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా గంటా శిబిరంలో జరుగుతోందా అన్న డౌట్లు వస్తున్నాయిట. ప్లాన్ బీ ఏంటి అంటే జనసేన పార్టీలోకి గంటా జంప్ చేయడం. జనసేనకు ఉత్తరాంధ్రా జిల్లాలలో పెద్ద లీడర్లు లేని లోటు ఉంది. గంటా అర్ధబలం, అంగబలం నిండుగా ఉన్నవారు. అంతవరకూ ఎందుకు ప్రజారాజ్యం టైమ్ లో ఆయనే మూడు జిల్లాలలో చక్రం తిప్పారు.
అటువంటి నాయకుడు కనుక తమ వైపున ఉంటే జనసేనకు ఉత్తరాంధ్రా జిల్లాలలో ఫోకస్ బాగా పెరిగి పని సులువు అవుతుంది. పైగా పార్టీ పటిష్టం అవుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అలాగే గంటాకు ఉన్న పరిచయాలు, ఆయనకు ఉన్న బలమైన అనుచరగణం కూడా జనసేనలోకి చేరిపోతుంది. ఆ విధంగా జనసేన ధీటైన పార్టీగా ఎదుగుతుంది
ఏ పార్టీలో ఉన్నా తన హవా చాటుకోవాలని చూస్తే గంటాకు టీడీపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఇబ్బందిగా ఉన్నాయని అందుకే ఆయన జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఇక జనసేనలో గంటాను తీసుకోవాలని ఆ పార్టీ వారు కూడా అధినాయకత్వాన్ని కోరుతున్నారని అంటున్నారు. ఆయన ఉంటే పార్టీ దూసుకుపోతుందని చెబుతున్నారుట.
ఇక పవన్ విషయానికి వస్తే గంటా నాడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం వెనక ఉన్నారని బలంగా నమ్ముతున్నారు. చిరంజీవిని ఈ విషయంలో ఒత్తిడి పెట్టి ఒప్పించిన వారిలో గంటా కూడా ఒకరు అని పవన్ భావిస్తున్నారు అంటున్నారు. దాని వల్లనే ఆయన గంటా చేరిక విషయంలో ఒకింత ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు. అయితే రాజకీయాల్లో ఓట్ల సీట్ల లెక్కలే ప్రధానం కాబట్టి గంటాను తీసుకోవడానికే జనసేన సుముఖంగా ఉందని అంటున్నారు.
ఈ మధ్య ఉత్తరాంధ్రా టూర్ చేసిన నాగబాబు పార్టీ బలంగా ఉందని, త్వరలో మరింత బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. ఈసారి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రా టూర్ ఉంటుందని కూడా తెలిపారు. అందువల్ల పవన్ టూర్ లోనే గంటా కండువా మార్చుకుంటారా అన్న చర్చ అయితే బయల్దేరింది. మరి టీడీపీలో ఉన్నా అధినాయకత్వం గతంలో మాదిరిగా పెద్దగా పట్టించుకోవడంలేదన్న ఆవేదనతో ఉన్న గంటా వర్గం షాకింగ్ డెసిషన్ తీసుకుంటారా అంటే వేచి చూడాలి మరి.