Begin typing your search above and press return to search.

ఏపీలో ఉప ఎన్నిక కోసం మాజీ మంత్రి పట్టు

By:  Tupaki Desk   |   7 Nov 2022 2:30 AM GMT
ఏపీలో ఉప ఎన్నిక కోసం మాజీ మంత్రి పట్టు
X
ఏపీలో ఉప ఎన్నిక రానుందా. అలా జరగాలని మాజీ మంత్రి పట్టుపడుతున్నారా అంటే అవును అనే అంటున్నారు. ఆయన ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత. రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఆయన సరైన టైం చూసి మరే ఉప ఎన్నికను తీసుకురావాలనుకుంటున్నారు. అందుకే ఇన్నాళ్ళూ సైలెంట్ గా ఉన్న ఆయన తన రాజీనామాను ఆమోదించాలని మరోసారి డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ఆయన స్పీకర్ ఫార్మెట్ లోనే తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కి పంపారు. ఆ మీదట తానే స్వయంగా శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి స్పీకర్ తమ్మినేని సీతారాం ని స్వయంగా కలసి తాను స్వచ్చందంగా రాజీనామా చేశాను కాబట్టి ఆమోదించాలని కోరారు. ఆ మీదట వెంటనే రాజీనామా ఆమోదం పొందుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ విధంగా జరగలేదు. ఆయన రాజీనామా పెండింగులోనే ఉంది.

ఈలోగా రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. గంటా ఆ ఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. దాంతో ఆయన రాజీనామా ఊసు మరచిపోయారు అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు సడెన్ గా ఆయన రాజీనామా విషయాన్ని బయటకు తీయడం విశేషం. పైగా ప్రధాని నరేంద్ర మోడీ 11, 12 తేదీలలో విశాఖ వస్తున్న వేళ ఆయన రాజీనామా ఆమోదించాలని కోరుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అన్న కారణం మీద ఆయన రాజీనామా చేశారు.

ఇక ప్రధాని విశాఖ టూర్ లో స్టీల్ ప్లాంట్ మీద స్పష్టమైన హామీ ఇవ్వమని స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు కోరుతున్నారు. దాంతో అదే సమయానికి తాను చేసిన రాజీనామా ఆమోదించుకుంటే కచ్చితంగా తనకు పొలిటికల్ మైలేజ్ ఉంటుంది అని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో పాటు మారిన రాజకీయ పరిస్థితులో విశాఖ నార్త్ లో కనుక ఉప ఎన్నికలు వస్తే కచ్చితంగా సంచలన ఫలితాలు ఉంటాయని ఆయన ఊహిస్తున్నారు.

విశాఖ నార్త్ లో జనసేన గ్రాఫ్ పెరుగుతోంది. అదే విధంగా టీడీపీ కూడా స్ట్రాంగ్ గా ఉంది. దాంతో ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసినా తాను విజయం సాధించగలను అన్న నమ్మకంతో ఆయన ఉన్నారని అంటున్నారు. అదే టైం లో ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు కనుక ఎదురైతే ఏపీలో మొత్తం రాజకీయ సమీకరణలు మారిపోతాయన్నది గంటా మార్క్ వ్యూహం అంటున్నారు.

దీని వెనక టీడీపీ ఆలోచనలు కూడా ఉన్నాయేమో తెలియదు కానీ వైసీపీకి బొత్తిగా రాజకీయంగా కలసిరాని కాలంలో ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదించి వైసీపీకి బిగ్ ట్రబుల్స్ తెచ్చిపెడతారా అన్నదే చర్చగా ఉంది. మరో వైపు చూస్తే వైసీపీ కనుక ఉప ఎన్నికలు కోరుకుంటే గత ఏడాది మొదట్లోనే గంటా రాజీనామా ఆమోదం పొందేది అని అంటున్నారు.

అప్పట్లో వరసగా ఉప ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎన్నికలను కూడా గెలుచుకుంది. దాంతో మూడున్నరేళ్ల పదవీ కాలం పూర్తి అయిన వేళ యాంటీ ఇంకెంబెన్సీ పెరుగుతున్న వేళ ఉప ఎన్నికను ఎదుర్కోవడం అంటే వైసీపీకి సుతరామూ ఇష్టం ఉండదు, అందువల్ల ఆ పార్టీకి చెందిన స్పీకర్ కూడా గంటా డిమాండ్ ని అలా ఎటూ తేల్చకుండా రాజీనామాను పెండింగులోనే ఉంచేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జగురుతుందో.