Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 'గంటా' మారిపోయాడు

By:  Tupaki Desk   |   17 April 2020 4:20 PM IST
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. గంటా మారిపోయాడు
X
తెలుపు చొక్కా.. తెలుపు ప్యాంట్లతో మందీ మార్బలంతో కనిపించే మాజీ మంత్రి - ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు ఇలా వంటింట్లో కాఫీ కాస్తూ కనిపిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.. కారణం ‘కరోనా’. అవును కరోనా కాటుకు కాదు ఎవరూ అనర్హం అన్నట్టుంది పరిస్థితి.

మొన్నటికి మొన్న కరోనాతో లాక్ డౌన్ లో ఏం చేయాలో పాలుపోని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో తన భార్యకు చికెన్ చేస్తూ కనిపించారు. ఇక హీరోలు ఇప్పటికే వంటింట్లో దూరి వంట చేస్తున్నారు.

ఇక ఉత్తరాంధ్ర దిగ్గజ నాయకుడు గంటా శ్రీనివాసరావు సైతం ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత వంట గదిలోకి ప్రవేశించడం విశేషం. గత కొన్నేళ్లుగా ఓటమెరుగని ఈ నేత.. చంద్రబాబు హయాంలో అంతకుముందు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా అందరికీ చిరపరిచితులే.. ఆయన అడుగుపెడితే పదుల సంఖ్యలో నేతలు.. సేవలు చేయడానికి అంతే మంది ముందుకు వస్తుంటారు.

అలాంటి నేత ప్రస్తుతం లాక్ డౌన్ తో రూపుమార్చుకున్నాడు. రాజకీయ దుస్తులను పక్కనపెట్టి బ్లాక్ టీషర్ట్ - జీన్స్ వేసుకొని ఎంచక్కా వంటగదిలో దూరి కాఫీ కాసేశారు. గంటావారి కాఫీ ఎలా ఉంటుందో తెలియదు.. కానీ కరోనా కారణంగా నేతలందరూ ఇలా తమలోని సమసిపోయిన కళలను సైతం బయటకు తీస్తుండడం విశేషంగా చెప్పవచ్చు. ఇంటిపట్టున సుబ్బరంగా కాఫీలు - టీలు - కూరలు వండేస్తుండడం గమనార్హం.